Niharika Konidela : గత కొద్ది రోజులుగా నిహారిక తెగ వార్తలలో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నిహారిక అతనికి బ్రేకప్ చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది.. కొంతకాలం క్రితం పెళ్లయిన వీరిద్దరూ ప్రస్తుతం విడిపోబోతున్నారన్న వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. నిహారిక మరియు చైతన్య మధ్యన వచ్చిన మనస్పర్ధలు వల్ల వారిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని టాక్. సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరిని మరొకరు అన్ ఫాలో చేసుకున్నారట.
అది మాత్రమే కాకుండా వారిద్దరి సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుంచి పెళ్లి ఫోటోలను డిలీట్ చేసినట్టు సమాచారం.. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. త్వరలోనే సరైన సమయం చూసుకొని సమంత మరియు నాగచైతన్యలు లాగా వీరిద్దరూ కూడా తమ విడాకుల గురించి అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. ఓ పక్క ఆమె విడాకుల వార్తలు వైరల్ అవుతుంటే ..మరోపక్క హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసింది నటి..నిర్మాత నిహారిక.
నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఆమె పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ బ్యానర్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తున్నారు. తన నిర్మాణ సంస్థను ఆమె మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఇందు కోసం ఓ ఆఫీస్ ఓపెన్ చేశారు. తన ప్రొడక్షన్ కంపెనీ కొత్త ఆఫీస్ కి సంబంధించిన ఫోటోలు నిహారిక ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేయడంతో ఆమె ప్రయత్నం సక్సెస్ కావాలని. తన బ్యానర్ లో హిట్ చిత్రాలు తెరకెక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నటిగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన నిర్మాతగా అయిన మంచి సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.