Niharika Konidela : సినిమా తారల వ్యక్తిగత వ్యవహారాల గురించి తెలుసుకోవడానికి జనాలు ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తూనే ఉంటారనే విషయం తెలసిందే. ఫిలిం సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి చాలా మంది ఆరా తీస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందాక సినీ తారల వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీయడం, చర్చించడం బాగా ఎక్కువైపోయింది. దానికి మరింత ఆజ్యం పోస్తూ.. ఊహాగానాలకు ఊతమిస్తూ ఉంటుంది కొంత మంది సెలబ్రిటీల వ్యవహార శైలి. కొన్ని రోజులుగా మెగా డాటర్ నిహారిక కొణిదెల ఆమె భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది.
నిహారిక, చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. మెగా ఫ్యామిలీలో అందరినీ ఫాలో అవుతున్న చైతన్య.. నిహారికను మాత్రం అన్‌ఫాలో చేయడం ఆశ్చర్యకరం. అంతేకాదు, తమ పెళ్లి ఫొటోలను సైతం చైతన్య ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేయడంతో అందరు ఆశ్చర్యపోయారు. నిహారికతో దిగిన ఒక్క ఫొటో కూడా ఇప్పుడు చైతన్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో లేదు. దీంతో నిహారిక, చైతన్య విడాకులు తీసుకోతున్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో చిరు రంగంలోకి దిగి వారిద్దరిని కలిపినట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా నిహారిక-వెంకట చైతన్య కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ చేస్తున్న మీడియా వర్గాలు… కలిసి పోయారని కథనాలు రాస్తున్నాయి.
పెద్దల జోక్యంతో ఒక్కటైపోయారనే వాదన వినిపిస్తుండగా, దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. నిజానికి నిహారిక, చైతన్యలది ప్రేమ వివాహం. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు అందరు పాల్గొన్నారు. జంట చూడముచ్చటగా ఉందని అప్పట్లో వీరిపై ప్రశంసల జల్లు కురిసింది. మెగా ఫ్యామిలీలోనే చూడచక్కనైన జంట అని అంతా అనుకున్నారు. కాని సడెన్‌గా ఇలా జరిగింది.