Naga Chaitanya : ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత- నాగ చైతన్య ఊహించని కారణాల వలన విడిపోయిన విషయం తెలిసిందే. విడాకుల తర్వాత ఎవరి దారులు వారివిగా మారాయి. అయితే సమంతతో నాగ చైతన్య విడాకులు తీసుకున్నాక ఎక్కువ మంది సమంత మీద నెగిటివ్ వార్తలు పుట్టించారు. దీంతో సమంత ఈ వార్తలపై పలుమార్లు సీరియస్ అయింది. సమంతకి సంబంధించిన వాళ్ళు కూడా చైతు సమంత విడాకుల వార్తలపై సీరియస్ అయ్యారు. విడిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటూ బిజీ అయ్యారు. విడాకుల తర్వాత చైతూ సైలెంట్ కాగా, సమంత మాత్రం డిప్రెషన్లోకి వెళ్లింది.
కొన్ని నెలల క్రితం నుండి నాగ చైతన్య మాత్రం నటి శోభితతో డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ వినిపించాయి. వీరిద్దరూ కలిసిన ఫొటో కూడా బయటకు రాలేదు, కలిసి ప్రాజెక్టు కూడా చేయలేదు కానీ వీరిద్దరూ ప్రేమ,డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై చైతు స్పందించకపోయినా శోభిత మాత్రం ఇండైరెక్ట్ గా ఇవన్నీ ఫేక్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. మొన్నామధ్య నాగ చైతన్య, శోభిత కలసి విదేశాల్లో షాపింగ్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా, అది మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని తేలింది. దీనిపై నాగ చైతన్య గానీ, శోభిత గానీ స్పందించలేదు.
తాజాగా నాగచైతన్య, శోభిత కలసి లండన్ లో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో వీరి డేటింగ్ మేటర్ మళ్లీ తెరపైకి వచ్చింది. వీరిద్దరూ కలసి లండన్ లో జమావర్ లో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటో అది. అక్కడ చెఫ్ సురేందర్ మోహన్ నాగ చైతన్యతో ఫోటో దిగారు. సురేందర్ ఆ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటో బ్యాగ్రౌండ్ లో టేబుల్ వద్ద శోభిత కూర్చున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటో కాస్తా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఆమె శోభితానే అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని చెప్పేస్తున్నారు.