Jayalalitha : అప్పట్లో వ్యాంప్ పాత్రలు చేసి తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన అందాల నటి జయలలిత. ఈమె గ్లామర్ షో చూసి అప్పట్లో హీరోయిన్లకు కూడా చమటలు పట్టేవట. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ‘ఇంద్రుడు చంద్రుడు’ చిత్రం ఈమెకు మంచి బ్రేక్ ఇవ్వడంతో.. ఆ తర్వాత వరుసగా ఈమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ,హిందీ భాషల్లో కలుపుకుని మొత్తం 650 కి పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈమె పలు సీరియల్స్ లో ముఖ్య పాత్రలలో నటిస్తూ మెప్పిస్తుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే మలయాళ డైరెక్టర్‌ని వివాహం చేసుకుంది.
మలయాళ దర్శకుడు వినోద్, తాను ఏడేళ్లుగా ప్రేమించుకున్నాం. అని చెప్పిన జయలలిత..మలయాళంలో ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను అని పేర్కొంది.. అయితే అతడిని పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న సందిగ్దంలో ఉన్న సమయంలో.. ఇక్కడ మన వాళ్లకు పరిచయం చేసేందుకు పంక్షన్లకు తీసుకువస్తే.. నిన్ను సరిగా చూసుకుంటాడా అని అడిగేవారు. అయితే ప్రేమ గుడ్డిది కదా.. గిరిబాబు, చలపతిరావు, కృష్ణంరాజు మేకప్ మ్యాన్, ప్రొడ్యూసర్ జయకృష్ణ వంటి నటులు చెప్పి న కూడా వినకుండా చేసుకున్నా..అయితే నా కోసం విషం తాగి చచ్చిపోతామన్నారు. రక్తంతో ఉత్తరాలు రాయడం. ఇవన్నీ చూసి సిన్సీయర్ లవ్ అనుకున్నా.
చివరకు గుడిలో పెళ్లి చేసుకున్నాం. అయితే పెళ్లికి ఇష్టం లేకపోయినా మా వాళ్లు వచ్చారు. అయితే పెళ్లైన వారానికే నా భర్తకు ఈ విషయం తెలిసి, ఫవరాఫ్ అటార్నిటీ క్యాన్సిల్ చేయమని అడిగారు. అప్పుడు అర్థమౌంది.. నన్ను ఆస్థి కోసమే చేసుకున్నారు. మూడు నెలలు కాపురం చేశాక.. నాలుగు నెలల నుండి గొడవలు మొదలయ్యాయి. దీంతో ఏడాది కూడా కాపురం చేయకుండానే విడిపోయాం. అయితే నన్నుగదిలో బంధించి యాసిడ్ పోసేస్తానని, చంపేస్తాను.. అంటూ ఎంతో హింసించాడు. అప్పుడు చలపతిరావు, గోపాలకృష్ణ వచ్చి ఆ ఇంట్లో నుండి విడిపించారు‘ అని జయలలిత చెప్పుకొచ్చింది.