Nidhi Agerwal : వేణు స్వామి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినీ ప్రముఖుల ప్రమేయం లేకుండానే వారి జాతకాలు చెబుతూ, వారి జీవితంలో జరగబోయే సంఘటనల గురించి ముందుగానే వివరిస్తూ పాపులారిటీ సంపాదించుకున్నారు వేణు స్వామి. అక్కినేని నాగచైతన్య, సమంత జాతకాలను ఉద్దేశించి అప్పట్లో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. వీరిద్దరి జాతకం ప్రకారం ఈ జంట ఎక్కువ కాలం కలిసి ఉండలేరని ఆయన చెప్పడం, అది నిజం కావడంతో మనోడికి ఫుల్ డిమాండ్ పెరిగింది. యూట్యూబ్‌లో తరచు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా ఫేమస్ అయ్యాడు.
అయితే ఆయన చెప్పినవి కొన్ని నిజం కావడంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలకి కూడా ఆయనపై నమ్మకం పెరిగింది. ప్రముఖ హీరోయిన్స్ ఆయనతో జాతకాలు చెప్పించుకోవడం లేదంటే పూజాలు చేయించడం వంటివి చేస్తున్నారు. తాజగా నిధి అగర్వాల్ ఈయనతో పూజ చేయించుకుంది. ఆమె పక్కనే కూర్చొని వేణుస్వామి ఈ పూజ చేయించారు. గతంలో రష్మిక మందనతో కూడా వేణుస్వామి పూజ చేయించిన విషయం తెలిసిందే. నిధి అగర్వాల్‌తో వేణు స్వామి పూజ చేయించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

తాజాగా చక్కర్లు కొడుతున్న వీడియోలో నిధి అగర్వాల్.. పింక్ కలర్ చుడీదార్ ధరించి.. వేణుస్వామి బృందం చెబుతున్నట్టుగా వేదమంత్రాల నడుమ కలశానికి పూజలు చేశారు. నిధి అగర్వాల్ ఈ పూజ ఎందుకు చేశారు.. కెరీర్ పరంగా బాగుండాలి అని పూజలు చేసిందా.. లేక ఆమె జాతకంలో ఏమైనా దోషముందా వంటి విషయాల గురించి క్లారిటీ రావలసి ఉంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ హరిహర వీరమల్లు చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. టాలీవుడ్‌లో మోస్ట్ ఎగ్జైటెడ్ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం రూపొందుతుంది.
వేణుస్వామి వేణుస్వామి !
వేణుస్వామి చుట్టు తిరుగుతున్న హీరోయిన్లు
మొన్న #Rashmika ఈరోజు #NidhhiAgerwal , #VenuSwami తో పూజ చేయిస్తే చాన్సులు పెరుగుతాయి అని నమ్ముతున్న Young Heroines ?! pic.twitter.com/kctqcnv7q0
— Daily Culture (@DailyCultureYT) March 27, 2023