Srikanth : ఒకప్పటి టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 32 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న శ్రీకాంత్ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. పీపుల్స్ ఎన్ కౌంటర్’ సినిమాతో 1991లో తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ, చాలా వేగంగా 100 సినిమాలను పూర్తిచేశారు.నేను మంచి నటుడిని కావడం వలన నాకు ఎక్కువ అవకాశాలు వచ్చాయని చెప్పను. ఎప్పుడూ ఏ నిర్మాతనుగానీ .. దర్శకుడిగాని అయితే ఇబ్బంది పెట్టలేదు. నా క్రమశిక్షణ .. మంచి బిహేవియర్ వల్లనే అవకాశాలు వచ్చాయని నమ్ముతాను” అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్.
ఇక తనపై సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ పై కూడా స్పందించారు. శ్రీకాంత్- ఊహ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఆ మధ్య రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇన్నేళ్ల కాపురానికి శ్రీకాంత్- ఊహ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని అనేక ప్రచారాలు చేశారు. అప్పుడు దానిపై స్పందించిన శ్రీకాంత్ తాజాగా ఇదే విషయంపై మాట్లాడారు. ఆమధ్య నేను విడాకులు తీసుకున్నట్టు రాశారు. దాంతో అది నిజం కాదు అని చెప్పడానికి నాభార్య ఊహాను వెంట పెట్టుకుని పార్టీలు..ఫంక్షన్స్ కు వెళ్తున్నాను. తనకు సినిమా ఫంక్షన్స్ అన్నా.. పార్టీలు అన్నా ఇష్టం ఉండదు. కాని బ్రతిమలాడి తీసుకెళ్ళాల్సి వస్తుంది.
ఇక రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావుపై కూడా రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేశారు గాసిప్ రాయుళ్లు. కోట ఇకలేరంటూ వార్తలు రావడంతో ఆయనే స్వయంగా స్పందించారు. రీసెంట్ గా నా ఫోటో పెట్టి నేను చనిపోయినట్టు కూడా రాశారు. అది చూసి మేము తట్టుకోగలం..కాని అమ్మవాళ్లు చూస్తే.. పరిస్థితి ఏంటి..? వీటి గురించి ఎవరైన ఆలోచించారా..వారిపైన యాక్షన్ తీసుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదు, మా కష్టాలని అర్ధం చేసుకొని వారే మారాలి అని శ్రీకాంత్ అన్నారు. కెరీర్ పరంగా చూస్తే ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీకాంత్. సహ నటి ఊహను ప్రేమించి పెళ్లాడారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు శ్రీకాంత్.