Anasuya : బ్యూటీఫుల్ నటిగా క్రేజ్ అందుకుంటున్న అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ద్వారా అసలైన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆమె ఆ తరువాత వెండితెరపై కూడా తనకు సెట్టయ్యే పాత్రలను చేస్తూ రేంజ్ ను అమాంతం పెంచేసుకుంది. తన హోస్టింగ్ నైపుణ్యాలతోనే విస్తృతమైన ప్రశంసలు అందుకోవడంతో పాటు ఆమె షోలు రేటింగ్‌లు గట్టిగానే వచ్చేవి. అనసూయ ఎనర్జిటిక్ అండ్ ఎంగేజింగ్ పర్సనాలిటీ ఆమెను వీక్షకులకు దగ్గర చేసింది. యాంకర్‌గా చేస్తూనే సినిమాలలోను తన అదృష్టం పరీక్షించుకుంది అనసూయ.
2016 లో “క్షణం” చిత్రంలో తన నటనను ప్రారంభించిన అనసూయ “గాయత్రి,” “రంగస్థలం,” అలాగే “మీకు మాత్రమే చెప్తా” వంటి చిత్రాలలో నటించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆమె చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో అదరగొట్టిన అనసూయ పుష్ప 2లో కూడా కీలక పాత్ర పోషించనుంది. అయితే ఇటీవల అనసూయకి పెద్దగా సక్సెస్ లు రాలేదు. మంచి హిట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
ఇక అనసూయ అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటోలతో కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. రంగస్థలం సినిమాతో రంగమ్మత్తమ్మగా మారిపోయిన అనసూయ పుష్ప సినిమాల్లో కూడా మంచి బోల్డ్ రోల్ లో నటించింది. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలోనే ఊహించిన విధంగా కనిపిస్తోంది. ఇక ఇటీవల కూడా మరోసారి అనసూయ అందరికీ షాక్ ఇచ్చేలా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా చిన్న నిక్కరులో అనసూయ తన లెగ్స్ అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. ఇక ఆ ఫోటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.అనసూయ ఇలా అందాలు ఆరబోయడం కొత్తేమి కాదు. ఈ పిక్స్ చూసి కొందరు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.