Rocking Rakesh : జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు పొందిన రాకింగ్ రాకేష్ కొంత కాలంగా జోర్దార్ సుజాతతో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు శుక్రవారం రోజున వీరు వివాహం చేసుకున్నారు. తిరుమలలో వీరి పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సుజాతతో ఏడడుగులూ వేశాడు రాకేష్. వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. వీరి పెళ్లికి జబర్దస్త్ నుంచి పలువురు కమెడియన్లు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిని చూసిన నెటిజన్స్ జంట చూడ ముచ్చటగా ఉందని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
రాకేష్ మిమిక్రీ ఆర్టిస్టు గా కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత తనకున్న పాపులారిటీ టాలెంట్ తో జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో ధనరాజు టీం లో ఒక కమెడియన్ గా చేశాడు. తర్వాత కిరాక్ ఆర్పీ టీమ్ లో చేరాడు. తర్వాత వీరిద్దరూ టీమ్ లీడర్లుగా వ్యవహరించారు. ఆర్పీ ‘జబర్దస్త్’ నుంచి వెళ్లిపోవడంతో తానే టీమ్ ను లీడ్ చేస్తూ అలరించాడు. ఇక సుజాత న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ ను ప్రారంభించి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీతో మరింత పాపులర్ అయింది. అంతకుముందే రాకింగ్ రాకేష్ తో సుజాతకు పరిచయం ఉంది. కాని జబర్ధస్త్‌లో ఎప్పుడైతే వీరు ఇద్దరు కలిసి పని చేశారో అప్పుడు ప్రేమలో పడ్డారు.
స్వయంగా వారే తాము త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నామని ఓ సారి ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి సిద్దమయ్యింది ఈ బుల్లితెర జంట. గతంలో వీరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు వీరి పెళ్లి తిరుపతి లో వైభవంగా జరిగింది. ఎట్టకేలకు ఈ జంట ఎలాంటి అవాంతరాలు లేకుండాగ్రాండ్గా పెళ్లి చేసుకున్న నేపథ్యంలో రాకేష్, సుజాతలకు నెటిజన్స్ అభినందనలు తెలియజేస్తున్నారు.