YSRCP Song 2024 : ఇప్పుడు ఎన్నికలలో కూడా సాంగ్ ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కోసం రాసిన మూడు రంగలు జెండానెత్తి పాట ఎంత ప్రభంజనం పుట్టించిందో మనం చూశాం. ఇక ఇప్పుడు పలువురు రాజకీయ నాయకులు కూడా ప్రత్యేక సాంగ్స్ రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవినేని అవినాష్ ప్రత్యేక సాంగ్‌ని తయారు చేయించుకున్నాడు. ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. టీడీపీ నాయకులని వణికిస్తుంది. మరిచారా ఆ సామి ఆనాటి సేవలని, గుర్తుంది కృష్ణమ్మ అలజడిని అంటూ పాట సాగింది.
ఇక అందులో దేవినేని ఉమ చేపట్టిన కార్యక్రమాలన్నింటిని చూపిస్తూ అద్భుతంగా సాగిస్తుంది. ఇప్పుడు ఈ పాట వైసీపీ శ్రేణులనే కాక నెటిజన్స్‌ని కూడా ఎంతగానో అలరిస్తుంది. ఇక ఇదిలా ఉంటే విజయవాడ కేంద్రంగా రాజకీయాలను శాసించిన కుటుంబాల్లో దేవినేని ఫ్యామిలీ ఒకటి. దివంగత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. అనంతర కాలంలో కాంగ్రెస్‌లోనూ తనదైన ముద్ర వేసిన నెహ్రూ.. రాష్ట్ర విభజన తర్వాత తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. కానీ అనారోగ్యంతో ఆయన కొద్దిరోజులకే కన్నుమూశారు. అయితే తన కుమారుడు దేవినేని అవినాష్‌ను ఎమ్మెల్యేగా చూడాలని ఎంతో ఆశపడ్డారు. ఇందుకోసం చంద్రబాబు నాయుడుతో వున్న పాత వైరాన్ని కూడా పక్కనపెట్టి ఆయనతో చేతులు కలిపారు. కానీ తన కల నెరవేరకుండానే నెహ్రూ కన్నుమూశారు.

నెహ్రూ కోరిక మేరకు చంద్రబాబు అవినాష్‌ను ప్రోత్సహించారు. 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దింపారు. కానీ అక్కడ బలమైన నేత కొడాలి నాని వుండటంతో అవినాష్ ఓటమిపాలయ్యారు. తదనంతర కాలంలో టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరారు. తన కుటుంబానికి ఎంతో పట్టున్న విజయవాడ తూర్పు నుంచి బరిలో దిగారు. ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా వున్న ఆయన.. నేతలను, కేడర్‌ను కలుపుకుపోతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు.