Yashoda Movie Review : స్టార్ హీరోయిన్ సమంత కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేసిన సంగతి తెలిసిందే. యూటర్న్, ఓ బేబి చిత్రాలతో సమంత లేడి ఓరియెంటెడ్ చిత్రాలతోను తాను ఆకర్షిస్తానని నిరూపించింది. ఇప్పుడు యశోదతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. .సమంత కొద్దీ రోజుల నుండి తనకి ఉన్న మయోసిటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న విషయం మనకి తెలిసిందే..అయితే చికిత్స తీసుకుంటూ కూడా ఆమె మధ్యలో సినిమాకి డబ్బింగ్ చెప్పడమే కాకుండా ప్రొమోషన్స్ లో కూడా పాల్గొంది..భారీ అంచనాలతో నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ :
మధ్యతరగతి మహిళలను టార్గెట్ చేస్తూ.. సరోగసి తల్లులుగా మారుస్తూ ఓ మాఫియా నడుపుతుంటారు కొందరు ధనవంతులు. ఈ క్రమంలోనే ఓ ల్యాబ్ ఒక పెద్ద మాఫియా తో డీల్ కుదిరించుకుంది.ఆ మాఫియా చేసే అకృత్యాల వల్ల బలైన ఎంతోమంది యువతులతో ఒకరు యశోద..అసలు సరోగసి పేరు మీద అక్కడ చేస్తున్న అక్రమ వ్యాపారం ఏమిటి..? సరోగసి తల్లులుగా మారిన స్త్రీలను ఏమి చేస్తున్నారు..? యశోద సరోగసి మాఫీయా నుండి ఎలా బయటపడింది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
విశ్లేషణ:
యశోద సినిమా కోసం సమంత ఎంతో కష్టపడింది. అనారోగ్యాన్నిసైతం లెక్కచేయకుండా సినిమా కోసం తాపత్రేయపడింది. సెలైన్ ఎక్కుతుండగానే.. డబ్బింగ్ చెప్పుకుంది. చిత్రంలో సమంత పెర్ఫామెన్స్ కు నిరాజనాలు పలుకుతున్నారు ఆడియన్స్. సామ్ కష్టానికి బాగా కనెక్ట్ అయ్యారు … కదిలిపోయారు. ఆరోగ్యం సహకరించకపోయినా.. ఆమె నటనలో ఏమాత్రం అదికనిపించకుండా అద్భుతం చేసింది. ఇక ఆమె తోటి నటీనటులు ,ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళి శర్మ కూడా అద్భుతంగా తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇక యశోద సినిమాతో మరోసారి రెచ్చిపోయాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ముఖ్యంగా ఆయన ఈసినిమాకు ఇచ్చిన బీజీఎంకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. సినిమాని చూస్తునంత సేపు ప్రేక్షకులకు ఉత్కంఠ కలగడమే తప్ప బోర్ మాత్రం కొట్టదు..అంత ఆసక్తికరంగా ఈ మూవీ స్క్రీన్ ప్లే సాగుతుంది .హరి- హరీష్. కథ, స్క్రీన్ ప్లే విషయంలోచాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది..
ప్లస్ పాయింట్స్:
- సమంత నటన
- స్క్రీన్ ప్లే
- ఇంటర్వెల్ బ్యాండ్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
- స్లోగా సాగిన స్క్రీన్ ప్లే
చివరిగా..
ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన యశోద చిత్రం ఆద్యంత ఆసక్తికరంగా సాగింది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా సాగగా, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మరో ఆకర్షణగా చెప్పవచ్చు. సరోగసీకి బలవుతున్న అమాయకపు మహిళల గురించి చిత్రంలో ఆద్యంతం ఆసక్తిగా చూపించారు. ఇది కచ్చితంగా థియేటర్స్ లో అనుభూతి చెందాల్సిన సినిమా.
రేటింగ్ 2/5.