Viral Video : నిప్పుతో చెలగాటం వద్దని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆ మాటల్ని పెడచెవిన పెడితే దుష్ఫరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ యువకుడు ఫైర్‌తో ఆటలు ఆడి మూతి కాల్చుకున్నాడు. అక్కడున్నవారు అప్రమత్తంగా ఉండడంతో.. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్సవాలు, వేడుకల్లో కొందరు వివిధ రకాల స్టంట్స్ చేసి ఆకట్టుకుంటారు. అలాగే ఓ యువకుడు అగ్నితో రిస్కీ స్టంట్ చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
వేదికపై కాగడాను పట్టుకుని, నోటిలో పెట్రోల్ పోసుకుని దానిపైకి ఊదాలనుకున్నాడు. అది కాస్తా వికటించి ముఖానికి మంటలు అంటుకున్నాయి. అక్కడున్న ఇతర యువకులు వెంటనే అప్రమత్తమయ్యారు. గడ్డానికి అంటుకున్న మంటలను ఆపడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు మంటలు ఆగాయి. ఈ వీడియోను రవి పటిదార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అక్టోబర్ 6న పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.

ఇప్పటి వరకు 12.3 మిలియన్ల మంది చూశారు. అయితే, ఇది ఎక్కడ జరగిందనే విషయం తెలియదు. దీనిపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు చేసినందుకు వ్యక్తిని విమర్శించారు. నిప్పుతో ఆడకండి.. కాలిపోతారని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. సోదరా ఇలాంటి వాటితో జీవితాన్ని కోల్పోతారు జాగ్రత్త అని మరొకరు కామెంట్ పెట్టారు. ప్రాక్టీస్ లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయకూడదు అంటూ ఇంకొకరు హెచ్చరించారు.
View this post on Instagram