Venu Swamy : సమంత – నాగ చైతన్య విడాకుల విషయం గురించి ముందుగానే చెప్పి అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఈయన సినిమా ప్రముఖులు, రాజకీయల నాయకుల జాతకాల గురించి తరచూ మాట్లాడుతుంటారు. ఇప్పటివరకు చాలా మందిపై కామెంట్స్ చేసిన వేణు స్వామి అందులో ఏదో ఒక కాంట్రవర్సీ ఉండేలా చూసుకుంటాడు. అయితే ఆ మధ్య విజయ్ దేవరకొండ గురించి వేణు స్వామి కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. విజయ్ దేవరకొండను తెలంగాణ మెగాస్టార్ అని యాంకర్ అభివర్ణించగా విజయ్ దేవరకొండకు అంత సీన్ లేదని వేణు స్వామి గాలి తీసేశారు.
విజయ్ దేవరకొండది మరో ఉదయ్ కిరణ్ లాంటి జాతకం అని, ఆయనకు అనుకోకుండా కొన్ని హిట్స్ వచ్చాయి అని అన్నారు. గత ఏడాది జనవరి నుంచి ఆయనకు అష్టమ శని స్టార్ట్ అయిందని చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళతాడని వేణు స్వామి కుండ బద్దలు కొట్టారు. ఆయనను తొక్కేస్తున్నారని ఆయన అభిమానులు అంటున్నారు అంటే అసలు ఆయనను తొక్కేసే అవసరం ఎవరికి ఉంది? ఆయనను తొక్కేసే అంత సినిమా ఆయనకు లేదు అని వేణు స్వామి అన్నారు.
![Venu Swamy : ఉదయ్ కిరణ్‌లాగే విజయ్ దేవరకొండ జాతకం.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు.. Venu Swamy sensational comments on Vijay Devarakonda](http://3.0.182.119/wp-content/uploads/2022/09/venu-swamy.jpg)
లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ చాలా డీలా పడ్డారు. ఆయన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో వేణు స్వామి మాట్లాడుతూ.. విజయ్ కి అష్టమి నడుస్తోందన్నారు. ఆయన జాతకం ప్రకారం.. అష్టమ శని ప్రారంభం అవ్వడం తో లైగర్ కు ముందు వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యిందన్నారు. ఇంకొన్నాళ్లు ఈ ప్రభావం ఉంటుందన్నారు. ఆయనకు మన్ముందు కూడా కష్టంగానే ఉంటుందన్నారు. మరి వేణు స్వామి వ్యాఖ్యలు విజయ్ విషయంలో ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.