నందమూరి తారకరత్న నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు. శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న కన్నుమూశారు. కొద్ది సేపటి క్రితం ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే అందరితో ఎంతో అప్యాయంగా, ప్రేమగా ఉండే తారకరత్న ఇకలేరని అంటే నమ్మలేకపోతున్నామని కుటుంబసభ్యులు, అభిమానులు అంటున్నారు.
పెద్దలంటే గౌరవంతోపాటు సినీ ఇండస్ట్రీలో సౌమ్యుడిగా తారకరత్న పేరు తెచ్చుకున్న తారకరత్న మరణంపై ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ.. నందమూరి కుటుంబానికి తారకరత్న ఎప్పుడూ దూరం కాలేదు. ఇక తాత నందమూరి తారక రామారావు అంటే తారకరత్నకు ఎనలేని అభిమానం ఉంది. తాతపై ఉన్న అభిమానంతోనే తారకరత్న ఆయన పిల్లలకు ఎన్టీఆర్ పేరు కలిసేలా పేర్లు పెట్టారు. తారకరత్న, అలేఖ్యారెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు.
ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తాత ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం ఎన్, తాన్యారామ్‌లో టీ, రేయాలో ఆర్.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టి తన తాతపై ఉన్న ప్రేమని చాటుకున్నారు తారకరత్న. తారకరత్నకి తన జీవితంలో 9 నెంబర్ అసలు కలిసి రాలేదు. ఆయన మరణించిన రోజులో కూడా 9 ఉండడం గమనర్హం. సినీ కెరీర్‌లో మొదట్లోనే ఏకంగా 9 సినిమాలను ఒకే రోజు ప్రారంభించి రికార్డు సృష్టించారు తారకరత్న. అయితే, ఇందులో ఆరు సినిమాలు షూటింగ్‌కు కూడా నోచుకోకపోవడం గమనార్హం.