దాల్చిన చెక్కను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. దాల్చినచెక్కతో మసాలా వంటలను చేస్తుంటారు. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేదంలో దీనికి ఎంతగానో ప్రాధాన్యతను కల్పించారు. దాల్చిన చెక్క వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్చినచెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలిఫినాల్స్ అనబడే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పలు రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. ఇన్ ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. నొప్పులు, వాపులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు దాల్చిన చెక్కలో ఉంటాయి. దీని వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడదు. కణజాలం పాడవకుండా ఉంటుంది.
శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు దాల్చిన చెక్కలో ఉంటాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగవుతుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వారికి దాల్చిన చెక్క ఎంతగానో మేలు చేస్తుంది. నిత్యం 1 టీస్పూన్ మోతాదులో ఏదో ఒక విధంగా దాల్చిన చెక్కను తీసుకుంటూ ఉంటే డయాబెటిస్ తగ్గుతుంది. రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఇన్సులిన్ లాంటి గుణాలు కలిగి ఉన్నందున టైప్ 2 మాత్రమే కాదు, టైప్ 1 డయాబెటిస్ ఉన్న వారికి కూడా ఇది మేలు చేస్తుంది.
దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల పార్కిన్సస్ డిసీజ్, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే జ్ఞాపకశక్తి తగ్గుదల, మతిమరుపు వంటి సమస్యలు రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు దాల్చిన చెక్కలో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అయితే దాంతోపాటు యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కూడా దాల్చిన చెక్కలో ఉంటాయి. దీంతో దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
హెచ్ఐవీ ఎయిడ్స్ కు మందు లేదని మనందరికీ తెలుసు. కానీ దాల్చిన చెక్కను తరచూ వాడుతూ ఉంటే హెచ్ఐవీ క్రిమి కూడా నాశనమవుతుందట. అలా అని పరిశోధనలే చెబుతున్నాయి. అధికంగా బరువు ఉన్న వారు దాల్చిన చెక్కను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటే బరువు తగ్గుతారు. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే గుణాలు దాల్చిన చెక్కకు ఉంటాయి. అందువల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.
ఇలా దాల్చిన చెక్కను ఉపయోగించడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. అయితే దాల్చిన చెక్కను ఎలా తీసుకోవాలి.. అని ఆలోచించే వారు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. ఎందుకంటే దీన్ని చాలా సులభంగా తీసుకోవచ్చు. చిటికెడు పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లు లేదా పాలలో కలిపి రోజూ రాత్రి తాగవచ్చు. లేదా దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఒక కప్పు మోతాదులో రోజులో ఎప్పుడైనా తాగవచ్చు. దీంతో అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.