తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులకి దగ్గరైన నటి సురేఖా వాణి. విజయవాడకు చెందిన సురేఖా వాణి నటి కావాలని సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. అయితే ఆమె కెరీర్ మొదలైంది యాంకర్ గా కాగా, తర్వాత తర్వాత నటిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకుంది. సురేఖా వాణి పక్కా హీరోయిన్ మెటీరియల్ అని చెప్పాలి. హైట్ అండ్ స్లిమ్ బాడీతో బాలీవుడ్ భామలకు ఏమాత్రం తగ్గని అందంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఆమెకు ఎందుకోగాని కామెడీ, క్యారెక్టర్ రోల్స్ దక్కాయి. సురేఖా వాణికి రెడీ, దుబాయ్ శ్రీను, నమో వెంకటేశా, బొమ్మరిల్లు వంటి చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి. లేడీ కమెడియన్ గా పాపులర్ అయ్యారు. కెరీర్ సాఫీగా సాగుతున్న తరుణంలో భర్త సురేష్ తేజ కన్నుమూశాడు.
దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2019లో సురేఖా వాణి భర్త మరణించగా కొన్నాళ్ళు ఆమె పరిశ్రమకు దూరమయ్యారు. అయితే ఒకప్పుడు సురేఖా వాణి ప్రతి సినిమాలో కనిపించేది. కాని ఇటీవల సిల్వర్ స్క్రీన్ పై కనిపించడమే అరుదై పోయింది. ఆ మధ్య ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న సురేఖా వాణి పరిశ్రమ మీద అసహనం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ నన్ను పక్కన పెట్టేసింది. సురేఖా వాణి సినిమాల్లో కనిపించడం లేదని పలువురు అంటున్నారు. ఆఫర్స్ వస్తే ఎందుకు నటించను… అని సురేఖా అన్నారు. అయితే ఈ అమ్మడు ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
తాజాగా బీచ్ వెకేషన్ కి వెళ్లింది సురేఖా వాణి. సాగర తీరంలో ఆహ్లాదంగా గడుపుతున్నారు. తన వెకేషన్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. ఆరంజ్ కలర్ ట్రెండీ వేర్ ధరించిన సురేఖా వాణి… సాయంత్రం వేళ తీరాన కూర్చొని జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేయగా, సురేఖా వాణి పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. సురేఖా వాణి పోజులు చూసి పిచ్చెక్కిపోతున్నారు. తన కూతురితో దిగిన ఫొటోలు చూసిన నెటిజన్స్ చూసి ఈ ఇద్దరిలో తల్లి, కూతురు ఎవరో కూడా చెప్పలేకపోతున్నాం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన ఇటీవలి కాలంలో సురేఖా వాణి ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.