Sr NTR Speech : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా వేరే చోట కూడా ఇప్పటికీ ఆయన పేరు మారు మ్రోగిపోతూనే ఉంటుంది. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలోనే ప్రభంజనం సృష్టించిన ఘనత ఎన్టీఆర్‌కి దక్కుతుంది. 1983 జనవరి 9న ఎల్బీ స్టేడియంలో విశేష జన సమూహం మధ్య సీఎంగా ప్రమాణం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేశారు. అయితే సీఎం కాకముందు కూడా ఎన్టీఆర్ తన స్పీచ్‌తో ఎంతో మంది మనసలు కొల్లగొట్టాడు. ప్రజలకు అన్యాయం చేసే ప్రభుత్వ తీరుని ఎండగడుతూ ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి మనసుల్లో బలంగా నాటుకుపోయాయి.
విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావును అభిమానులు స్వీట్ గా ఎన్టీఆర్ పిలుచుకుంటారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రీతిలో తెలుగు ప్రజలందరి చేత అన్నా అని జేజేలు పలికించుకున్న మేరు నగధీరుడుగా చరిత్రలో నిలిచిపోయారు. సినిమాలలో ఉన్నప్పుడే ఆయన రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ ప్రచారరీత్యా 90 రోజుల వ్యవధిలో 35000 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని తన పేర లిఖించుకున్నారు.
![Sr NTR Speech : అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ గారి స్పీచ్.. ఇట్లా మాట్లాడితే ఎవరైనా సీఎం అవుతారు.. Sr NTR Speech old video viral on social media](http://3.0.182.119/wp-content/uploads/2023/06/sr-ntr-speech.jpg)
కాంగ్రెస్ పాలకులు అమలు చేస్తున్న పథకాలతో పాటు వారి పనితీరుని ఎన్టీఆర్ ఎండగట్టారు. ఆయన ప్రజల కోసం ప్రజల కొరకు అన్న చందాన పరిపాలన సాగించారు. నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని అండగట్టాలి. తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఏర్పడింది. ప్రజా స్వామ్యాన్ని మనం రక్షించుకోవాలి. రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వారి వలన పార్టీ మనుగడ ఉండదు. మంచి వారు ఎప్పుడు మంచి వారే. వారి మంచి తనం తప్పక గుర్తించబడుతుంది అంటూ ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ ఎవరు అయిన వింటే తప్పక సీఎం అవుతారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
https://youtube.com/watch?v=bH2tmYscCog