Shiksha Das : ఐపీఎల్ టోర్నమెంట్ ప్రతి ఒక్కరికి మంచి మజాని అందిస్తుంటుంది. క్రికెట్ ప్రియులు, హీరోయిన్స్,పలువురు స్టార్స్ కూడా ఐపీఎల్‌లో తెగ సందడి చేస్తుంటారు. ప్రతి ఏడాది కూడా కొందరు భామలు ఐపీఎల్‌తో ఫేమస్ అవుతుండడం మనం చూశాం. గతేడాది గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరఫున వేర్వేరుగా ఇద్దరు మిస్టరీ గర్ల్స్ చేసిన సందడి ఎంత వైరల్ గా మారిందో మనం చూశాం. తర్వాత వారు సాహిబా షెర్నీ, అదితి హుండియా అని తెలిసింది. అదే విధంగా ఇప్పుడు కూడా బెంగాలీ అమ్మాయి ఐపీఎల్ స్టాండ్ లో సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కెమెరా కంటికి చిక్కింది ఒక అమ్మాయి.
ఆ అమ్మాయి ఎవరు అంటూ ఔత్సాహికులైన నెటిజన్లు వెతకడం ప్రారంభించారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యింది. కిక్కిరిసిన స్టేడియంలో నిల్చొని ఫిగర్ హగ్ క్రాప్ టాప్ లో ఫోజులిచ్చి తన స్టన్నింగ్ ఫిగర్ ను ప్రదర్శించింది ఆ యువతి. అసలు ఆమె ఎవరని ఆరా తీస్తే బెంగాలీ నటి, మోడల్ శిక్షా దాస్ అని తెలిసింది. ఆమె కేకేఆర్ కు మద్దతుగా క్రికెట్ చూసేందుకు వచ్చిందని తెలిసింది. ప్రస్తుతం శిక్షా దాస్ పిక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మందికి ఆమె పేరు కూడా తెలియదు కానీ ఇప్పటికీ ఆ ఫోటోలను వారి వైరల్, స్పైసీనెస్, ఆమె మెరిసే చిరునవ్వు కోసం షేర్ చేస్తున్నారు. ఈ అమ్మడిని ఇలా చూసి ప్రతి ఒక్కరు చిత్తైపోతున్నారు.
ఇప్పుడు ఈ బ్యూటీ సినీ రంగంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ అమ్మడిపై టాలీవుడ్ ఫోకస్ మళ్లిందని చెబుతున్నారు. పూరి జగన్నాథ్, ఆర్జీవీ లాంటి ప్రముఖులు ఈ భామకు అవకాశం ఇచ్చేందుకు వెనకాడరని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఆర్జీవీ ఎప్పుడు కొత్త టాలెంట్‌నిపరిచయం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో బెంగాలీ బ్యూటీనిఆ పరిచయం చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకసారి ఎంట్రీ ఇస్తే మళ్లీ వెనక్కి తిరిగే చూసే అవకాశం ఉండదు.