Sai Dharam Tej : టాలీవుడ్ ప్రముఖ హీరో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోనే జాతీయ స్థాయిలో వినపడుతుంది. పవన్ అందుకున్న రాజకీయ విజయంతో జనసైనికులు, ఆయన అభిమానులు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన సినిమాల సక్సెస్ కంటే ఎక్కువ కిక్ అని అభిమానులని అంతకు మించి మెగా కుటుంబానికి అందించింది. అయితే పవన్ విజయం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేసిన వారిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఒకడు.సాయి ధరమ్ పవన్ విజయం సాధించిన రోజు నుంచి ఎంతో ఉత్సాహంగా తన మావయ్య విజయాన్ని తన విజయంలా భావించి సెలబ్రేట్ చేసుకున్నాడు.
అయితే ఇది ఈ కొన్ని రోజులదే కాదు పవన్ గెలవాలని ఎప్పుడో గట్టిగా మొక్కుకున్నట్టు ఉన్నాడు. అలా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని మావయ్య కోసం తాను కూడా నిలబడ్డాడు. మరి మొక్కుకున్నట్టుగానే పవన్ గెలవడంతో సాయి ధరమ్ తేజ్ తిరుమల సన్నిధికి కాలి నడకన బయలుదేరాడు. దీనితో పలు వీడియోలో ఫోటోలు సాయి తేజ్ విషయంలో వైరల్ గా మారాయి. మరి ఈ చర్యతో పవన్ అంటే తేజ్ కి ఎంత గౌరవం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మెగా అభిమానుల్లో కూడా సాయి ధరమ్ తేజ్ మరో మెట్టు ఎక్కేసాడు అని చెప్పాలి.మరోవైపు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. రేయ్ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినా పిల్లా నువ్వులేని జీవితం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమా తేజ్ కు మంచి పేరుతో పాటు అవకాశాలను కూడా తీసుకొచ్చి పెట్టింది.

విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. ఈ నేపథ్యంలోనే తేజ్ జీవితంలో అనుకొని మలుపు తిరిగింది. బైక్ యాక్సిడెంట్ కు గురై చావు అంచుల వరకూ వెళ్లి వచ్చాడు.ఇక ఆ తరువాత విరూపాక్ష సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత గాంజా శంకర్ సినిమా ప్రకటించాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతుంది అనుకొనేలోపు ఈ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం సినిమాల గురించి పక్కన పెట్టి కళ్యాణ్ మామ మంత్రి అయిన సంతోషంలో మునిగితేలుతున్న తేజ్.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం.