Sr NTR : తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న నటుడు ఎన్టీఆర్. సినిమాలతో పాటు రాజకీయాలలోను ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘీకం ఎలాంటి చిత్రాలలోనైన సరే ఎన్టీఆర్ తనదైన ప్రదర్శన కనబరిచి అబ్బురపరిచేవారు. అయితే ఎన్టీఆర్ సినిమాలతో పాటు రాజకీయాలతోను తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఆయనని కొందరు దేవుడిగా కూడా ప్రార్ధించారు. ఇంత గొప్ప ఆదరణ ఎన్టీఆర్ పొందుతారని రేలంగి అప్పట్లో ఆయన అరచేయి చూసి చెప్పారు.
1958వ సంవత్సరంలో లలిత శివజ్యోతి వారి లవకుశ అనే చిత్రం ప్రారంభోత్సవం జరగగా, ఈ సినిమా ముహూర్తం షార్ట్ ఎన్టీఆర్ పై తీయాలని దర్శకుడు పుల్లయ్య గారు అనుకున్నారు. ఇక సినిమాలో నటించే నటీనటులు అందరూ ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. మరుసటి రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఎన్టీఆర్ కు తప్ప మిగిలిన వారు ఎవరికి మేకప్ వేసుకున్నారు. దీంతో శ్రీరాముని గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ పై యాక్షన్ చెప్పారు పులయ్య. ఆయన అలా నడుచుకుంటూ వచ్చారు. ఇంతలో డైరెక్టర్ కట్ అన్నారు. షార్ట్ బాగా పండింది.
![Sr NTR : ఎన్టీఆర్ జాతకం చూసి మహర్జాతకుడు అవుతావు అని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? relangi once said Sr NTR will become great actor one day](http://3.0.182.119/wp-content/uploads/2022/12/sr-ntr.jpg)
అందరూ చప్పట్లు కొట్టారు. అక్కడే ఉన్నటువంటి అలనాటి ప్రముఖ హాస్యనటుడు రేలంగి వెంటనే వచ్చి రామారావును కౌగిలించుకొని.. అసలు ఏమి తేజస్సు, ఏమి తేజస్సు అంటూ గుడిలో దేవున్ని చూసిన అనుభూతి కలిగింది అంటూ మాట్లాడారు. హస్తసాముద్రికం తెలిసిన రేలంగి ఎన్టీఆర్ అరచేతిని చూసి నీవు మహర్జాతకుడవు,నువ్వు ఏది పెట్టినా బంగారం, శుభం కలుగుతుందని చెప్పాడు. తిరుగులేని నటుడివి అవుతావు. పురాణపురుష పాత్రల్లో ఒదిగిపోయి పూజలు కూడా పొందుతావు. నీకు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎననోఅద్భుతాలు జరుగుతాయి అంటూ, దేశమంతా నీ పేరు మార్మోగిపోతోంది అని రేలంగి చెప్పుకొచ్చారు. ఆయన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.