Uday Kiran : టాలీవుడ్ లవర్ బాయ్‌గా సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్ కిరణ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఉదయ్ కిరణ్ అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయన ఎంత స్పీడ్‌గా ఎదిగాడో అంతే స్పీడ్‌గా డౌన్ ఫాల్ అయ్యాడు. చిన్న వయసులోనే జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఆత్మహత్య చేసుకొని అభిమానలుకి, తన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఉదయ్ కిరణ్ ప్రేమ పెళ్లి జీవితం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు.
మనసంతా నువ్వే తర్వాత జర్నలిస్ట్‌తో ఉదయ్ ప్రేమలో పడ్డాడు. కానీ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరగడంతో బ్రేకప్ అయింది. ఆ తరవాత కొంతకాలం పాటు ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లాడు. ఇక ఆ సమయంలో చిరు.. ఉదయ్‌కి చాలా సపోర్ట్ అందించారు. చిరంజీవికి ఆ బ్రేకప్ స్టోరీ తెలిసినప్పటికీ తన కూతురుతో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని అది ఉదయ్ కిరణ్ కు చెప్పడంతో మళ్లీ డిప్రెషన్ లో నుండి బయటకు వచ్చాడని ఉదయ్ అక్క చెప్పుకొచ్చారు. ఇక ఎంగేజ్మెంట్ జరిగిన తరవాత ఇద్దరూ మాట్లాడుకోగా అభిరుచులు భిన్నంగా ఉన్నాయని కలిసి ఉండలేమని భావించి విడిపోయారు.
![Uday Kiran : ఉదయ్ కిరణ్ మృతికి చిరంజీవే కారణమా.. సంచలన విషయాలు బయటపెట్టిన ఉదయ్ అక్క.. reason behind Uday Kiran death his sister sri devi told](http://3.0.182.119/wp-content/uploads/2022/09/uday-kiran-sridevi.jpg)
భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉదయ్ కిరణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నా తమ్ముడు కోటీశ్వరుడు.. మా అమ్మ మాకు భారీగానే ఆస్తులు ఇచ్చింది.. వాడికి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవు.. డబ్బుల్లేక చనిపోవాల్సిన ఖర్మ మా తమ్ముడికి పట్టలేదు అని ఉదయ్ అక్క శ్రీదేవి చెప్పింది. సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా తన తమ్ముడు ఎప్పుడూ కోటీశ్వరుడే.. వాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని కొట్టి పారేసింది శ్రీదేవి.