Taraka Ratna Last Photo : ఫిబ్రవరి 18న నందమూరి తారకరత్న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. చిన్న వయస్సులో ఆయన కన్నుమూయడం ప్రతి ఒక్కరిని కదిలించి వేసింది. ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు ఆ విషాదం నుండి బయటకు రాలేకపోతున్నారు. తారకరత్నను కోల్పోవడం ఆయన కుటుంబానికి పెద్ద లోటు అని చెప్పుకోవాలి. అయితే భర్త మరణంతో తారకరత్న వైఫ్ అలేఖ్య రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనవుతోంది.తన భర్తతో గడిపిన ఆ క్షణాలను మరచిపోలేకపోతున్న అలేఖ్య రెడ్డి… కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంత ఓదార్చినా కూడా కంటతడి పెట్టుకోకుండా ఉండలేకపోతుంది. ఈ నేపథ్యంలో తన భర్త తారకరత్న చివరి జ్ఞాపకాన్ని పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అలేఖ్య రెడ్డి.
తాజాగా అలేఖ్య రెడ్డి చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ అందరి హృదయాల్ని కలచి వేసే విధంగా ఉంది. తారకరత్నతో చివరగా దిగిన ఫోటోని అలేఖ్య సోషల్ మీడియాలో పంచుకుంది. చివరగా వారు తిరుమలకి వెళ్ళినప్పుడు ఆలయం వద్ద తారక రత్న, అలేఖ్య రెడ్డి తమ ముగ్గురు పిల్లలతో ఫోటో దిగారు. ఆ ఫోటోనే అలేఖ్య అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోకి కామెంట్‌గా ఇదే మా చివరి ఫోటో అని తలుచుకుంటుంటే నా గుండె ముక్కలవుతోంది. ఇదంతా కల అయితే బావుండు. నీ గొంతుతో అమ్మ బంగారు అంటూ లేపవా.. అంటూ తీవ్రమైన బాధతో ఈ పోస్ట్ పెట్టింది అలేఖ్య రెడ్డి. దీంతో ఈ పోస్ట్ చూసి నెటిజన్లు ఆమెకు మనో దైర్యం చేకూరాలని కోరుకుంటున్నారు.

ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇలా విడిపోవడం ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తుంది. కొన్నేళ్లు ప్రేమించుకొని పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు తారాకరత్న- అలేఖ్య రెడ్డి లవ్ స్టోరీ సినిమాల్లో మాదిరిగానే జరిగింది.. మొదట ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ నెలకొని ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబాల అంగీకారం లభించలేదు.అయినప్పటికీ వారు 2012 ఆగష్టు 2న సంఘీ టెంపుల్‌లో కొంత మంది బంధు మిత్రలు సమక్షంలో ప్రేమ వివాహాం చేసుకున్నారు తారకరత్న. అప్పటినుంచి తన భార్యతో వేరుగా ఉన్నారు తారకరత్న. ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు.