Ram Charan Marriage : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. చిరుత మూవీతో వెండితెరకు పరిచయమైన రామ్ చరణ్ రెండో చిత్రం మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ సినిమా రామ్ చరణ్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది అనే చెప్పాలి.. ఇక తనదైన మేనరిజమ్స్, డాన్స్, ఫైట్స్ తో ఆయన మాస్ హీరోగా ఎదిగిన రామ్ చరణ్ నటనలో తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లకే రామ్ చరణ్ వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. అపోలో హాస్పిటల్స్ అధినేత అనిల్ కామినేని కూతురు ఉపాసనను పెళ్లి చేసుకున్నారు.
2012 జూన్ 14న రామ్ చరణ్-ఉపాసనల వివాహం అంగరంగ వైభవంగా జరగగా, ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్-ఉపాసన పదేళ్ల వైవాహిక జీవితం ఇటీవల పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ హాలిడే ట్రిప్ కి వెళ్లారు. వారం రోజుల పాటు హాయిగా ఎంజాయ్ చేసి వచ్చారు. ఇక త్వరలో పండంటి బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి త్వరలో తన ఇంట్లో అడుగుపెట్టబోయే బుజ్జాయితో సరదాగా గడిపేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
![Ram Charan Marriage : స్టార్ హీరో కూతురిని ఇచ్చి తన కొడుక్కి పెళ్లి చేయాలనుకున్న చిరంజీవి.. ఎలా మిస్ అయింది..? Ram Charan Marriage chiranjeevi first wanted another woman](http://3.0.182.119/wp-content/uploads/2023/02/ram-charan-marriage.jpg)
అయితే రామ్ చరణ్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రామ్ చరణ్ అసలు టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ అల్లుడు కావాల్సిందట. వెంకటేష్ తన పెద్ద కూతురు ఆశ్రితను రామ్ చరణ్ కి ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నారట. చిరంజీవి-వెంకటేష్ మధ్య ఈ విషయంలో సంప్రదింపులు కూడా జరిగాయని, కాకపోతే ఆశ్రితతో పెళ్లి విషయం చెప్పగానే రామ్ చరణ్ తాను చాలా కాలంగా ఉపాసనను ప్రేమిస్తున్నట్లు తండ్రి చిరంజీవితో చెప్పాడట. ఆమెనే వివాహం చేసుకుంటాను అని చెప్పడంతో చేసేదేమీ లేక వెంకటేష్ కూతురుతో పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసి ఉపాసనని ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.