Ram Charan : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి. చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చిరుతగా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టి మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే రామ్ చరణ్ కు ఉపాసనతో వివాహం జరిగి సుమారు పదేళ్లు కావొస్తుంది. అప్పటి నుంచి ఈ దంపతులకు పిల్లలు లేరనే ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. పలు సందర్భాలలో ఉపాసన వీటికి సంబంధించి గట్టిగా సమాధానం ఇచ్చింది.
ఇటీవల సద్గురుతో ఉపాసన మాట్లాడిన మాటలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. అక్కడ పిల్లలకు సంబంధించిన ప్రస్తావన రాగా, ఉపాసన మొత్తం మూడు ప్రశ్నలు సద్గురుని అడగడం జరిగింది.. మాకు పెళ్లయ్యి 10 సంవత్సరాలు కావొస్తోంది అదేవిధంగా, మేము ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం, మా జీవితం ఎంతో ఆనందంగా ఉంది అయితే నన్ను చాలామంది అడిగే ప్రశ్నలు రామ్ చరణ్ తో రిలేషన్ షిప్ ఎలా ఉందని రెండవది పిల్లలు కనడం కి సంబంధించి మూడోవది రోల్ ఇన్ లైఫ్ ఈ మూడు ప్రశ్నలు అడుగుతూ ఇవన్నీ కూడా ప్రజలు మా గురించి అనుకుంటున్న ప్రశ్నలు దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి అంటూ సద్గురుని ఉపాసన ప్రశ్నించడం జరిగింది.
![Ram Charan : బిగ్ బ్రేకింగ్.. తల్లి కాబోతున్న ఉపాసన.. వెల్లడించిన చిరంజీవి..! Ram Charan and Upasana expecting first child told chiranjeevi](http://3.0.182.119/wp-content/uploads/2022/12/ram-charan-upasana.jpg)
ఆ సమయంలో సద్గురు స్పందిస్తూ ప్రస్తుతం భూమిపై జనాభా చాలా ఎక్కువ అయిపోయింది. ఒకరిపై మరొకరు నిలబడే పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి పిల్లల్ని కనక పోతే మంచిదని అన్నారు. ఎవరైతే పిల్లల్ని కనరో వారికి నేను ప్రత్యేకమైన అవార్డు ఇస్తాను అని సద్గురు చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యల తర్వాత ఉపాసన అసలు పిల్లల్ని కనదని అందరు అనుకున్నారు. కాని తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రామ్‌చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘‘”శ్రీ హనుమాన్ జీ ఆశీస్సులతో రామ్ చరణ్- ఉపాసన తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. కొణిదెల, కామినేని కుటుంబాల తరపున సంయుక్తంగా ఈ ప్రకటనను విడుదల చేశారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుష్‌గా ఉన్నారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2022