Raghurama Krishnam Raju : ఈ సారి ఏపీ ఎన్నికలు రంజుగా సాగడం ఖాయం. ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారనే దానిపై అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పవన్ కళ్యాణ్ నూతన గృహప్రవేశం చేశారు.. ఈ సందర్భంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పవన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ 65 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించనున్నట్లు జోస్యం చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి వచ్చి ప్రచారం చేసినా.. పవన్ విజయాన్ని అడ్డుకోలేరన్నారు.
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన జగన్‌ను ఓడించాలంటే మూడు పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని చెప్పి, ఒక్కటిగా చేసిన గొప్పవ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని రఘురామ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ భేటీపై రఘురామ స్పందిస్తూ… అరాచకశక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దుర్మార్గపు శక్తి నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్, నాగబాబులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడ్నించి పోటీ చేసినా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని చెప్పారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.
పవన్ కళ్యాణ్ తో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సరళిపై కూడా ఆయన మాట్లాడారు. అయితే ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని రఘురామ కృష్ణంరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ భేటీ పై మాట్లాడిన ఆయన అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని తెలియజేశారు. దుర్మార్గపు శక్తుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుద్దామని ఆయన పిలుపునిచ్చారు. తనకు పవన్ కళ్యాణ్ తోనూ, నాగబాబు తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా తనకోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.