Prakash Raj : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.అంత పెద్ద వయస్సులో చంద్రబాబుని అరెస్ట్ చేయడం ఉన్మాద చర్య అని జగన్‌ని చాలా మంది తప్పు పట్టారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికం అంటూ ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణలు స్పందించారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికం అంటూ ఫైర్ అయ్యారు. ఇక బాలయ్య ప్రెస్ మీట్.. జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఖూనీ చేసిందంటూ… ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రముఖ నిర్మాత అశ్వీనిదత్ కూడా ఓ వీడియోను రిలీజ్ చేశారు. బాబు అరెస్టుపై ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పుకొచ్చారు. ఇక అశ్వినీదత్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఒకప్పటి హీరో సుమన్ చంద్రబాబు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా చూసి చెప్పే జ్యోతిష్కుడు ఉంటే ఆయన ఎప్పుడు వస్తారో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. టైం అనేది బాగుంటే లోకల్ కోర్టులో కూడా అన్నీ అనుకూలంగానే జరుగుతాయన్నారు. ఆయనకు అన్నీ అనుకూలంగా వచ్చే వరకు జైలు లలోనే ఉంటారని వ్యాఖ్యానించారు.
ఇలా పలువురు పలు రకాలుగా చంద్రబాబు అరెస్ట్‌పై కామెంట్స్ చేయగా, ప్రకాశ్ రాజ్ ఓ డిబెట్ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు, మరి కొందరు స్పందించలేదు. టైం కొందరికి ఉంటుంది, కొందరికి లేదని అన్నారు. అయితే ఇవన్నీ కక్ష రాజకీయాలు. ఇవి ఎప్పటికైన చాలా డేంజర్ అని అన్నారు. ఏపీలో ఉన్నంత కక్ష రాజకీయాలు తనకి తెలంగాణలో కనిపించడం లేదంటూ చాలా ఓపెన్‌గా మాట్లాడారు ప్రకాశ్ రాజ్. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.