Team India : భారతదేశం అంతా కూడా దీపావళి పండుగని సందడిగా జరుపుకున్నారు. పండుగ రోజున పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు బానసంచాలు కాల్చడానికి ఇష్టపడతారు. దీపావళి సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు వారి వారి స్టైల్ లో దీపావళిని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక సినీ తారలు, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు దీపావళి పార్టీల సెలెబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్ అంతా ఒక్కటై వారి కుటుంబ సభ్యులతో కలసి దీపావళి సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు.
ఇక టీమిండియా ఆటగాళ్లు కూడా దీపావళి పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆదివారం (నవంబర్ 12) నెదర్లాండ్స్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో శనివారమే ఇండియన్ టీమ్ ఈ దీపాల పండుగను ఘనంగా జరుపుకోవడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పార్టీలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు ఇతర ప్లేయర్స్ అందరూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఎప్పుడూ టీమిండియా జెర్సీల్లోనే ఓ టీమ్ గా కనిపించే వీళ్లంతా ఇప్పుడిలా సాంప్రదాయ దుస్తుల్లో ఒకచోట చేరి ఫొటోలకు పోజులివ్వడం అభిమానులకు కొత్త అనుభూతిని అందించింది.
ఇక దీపావళి రోజు టీమిండియా నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు కేవలం 250 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇది వరుసగా 9వ విజయం. పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది టీమిండియా. టోర్నీలో టీమిండియా అజేయంగా నిలిచింది. ఇప్పుడు సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ నవంబర్ 15న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కి భారత్ చేరుకోవాలని ప్రతి భారతీయుడు కామెంట్ కోరుకుంటున్నారు.