Pavitra Lokesh : గత కొద్ది రోజులుగా నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్. ఇప్పుడు కాదు అప్పుడు కాదు.. ఎప్పటినుంచో ఈ ఇద్దరి సీక్రెట్ డేటింగ్ పై బోలెడన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. లవ్ స్టోరీ, పెళ్లి వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు నరేష్- పవిత్ర లోకేష్. కాకపోతే వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారనే ఆధారాలు మాత్రం ఎవ్వరికీ చిక్కడం లేదు. గత కొన్నాళ్లుగా రిలేషిన్ షిప్లో ఉన్న నరేష్- పవిత్ర లోకేష్.. మళ్ళీ పెళ్లి అనే కొత్త సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా.. వీళ్ళ పర్సనల్ మ్యాటర్ తెరపైకి వచ్చింది. ఇంతకీ మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా? లేదా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్న వేయగా, దానికి నరేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
పెళ్లి అనేది యూనియన్ ఆఫ్ ఆర్ట్స్.. అంటూ కాస్త తెలివిగా సమాధానం చెప్పారు నరేష్. అయితే చేసుకున్నట్టే అని జర్నలిస్ట్ అనడం, అవును కదా అన్నట్లుగా పక్కనే ఉన్న పవిత్ర లోకేష్ తల ఊపడంతో నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి అయిపొయింది అని అందరికి క్లారిటీ వచ్చేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇందులో నరేష్-పవిత్ర బంధంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ ఇంటి వ్యవహారాలను కూడా చూపించడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పవిత్ర లోకేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తమకు కృష్ణ, విజయనిర్మల ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందన్నారు. విజయకృష్ణ మూవీస్‌ను రీలాంఛ్ చేయడం శుభపరిణామమని పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చింది . ఈ బ్యానర్‌పై ఎన్నో మంచి సినిమాలు తెరకెక్కాయని చెప్పిన పవిత్ర తమ జంటకు కృష్ణ, విజయనిర్మల ఆశీస్సులు ఉంటాయన్నారామె. తనకు కావాల్సిన ఔట్‌పుట్‌ను ఎంతో ఓపికతో నటుల నుంచి తీసుకోవడం ఎంఎస్ రాజు ప్రత్యేకత అని పవిత్ర మెచ్చుకున్నారు. ‘మళ్లీ పెళ్లి’ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాగా, పవిత్ర లోకేష్‌ను చట్టబద్దంగా పెళ్లి చేసుకోవడానికి తన మూడో భార్య రమ్య రఘుపతికి విడకుల నోటీసులు పంపించారు నరేష్. అయితే.. ఆమె మాత్రం విడాకులు ఇవ్వడానికి ససేమిరా అన్నట్టు సమాచారం.