OTT Suggestion : స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో ఎన్నో అరాచకాలు జరిగాయి. ఎన్నో సంఘటనలు మనం చూశాం. చాలా మంది కిల్లర్స్ ప్రజలని భయబ్రాంతులకి గురి చేశారు. వారిలో ముందుగా చెప్పుకోవల్సింది గౌరి శంకర్. ఆయన ఆటో నడుపుతూ ఆటో శంకర్ అయ్యాడు. 1955లో వెల్లూరు జిల్లాలోని కాంగేయనల్లూరు గ్రామంలో జన్మించిన శంకర్.. పెరియార్‌నగర్‌లో తొలుత పెయింటర్‌గా పనిచేశాడు. 1980 దశాబ్దంలో తమిళనాడు ప్రజలకు ‘ఆటో శంకర్’ అంటే హడల్. అతడొక ఆటో డ్రైవర్, దొంగ సారా ఏజెంట్, కరడుగట్టిన క్రిమినల్, సీరియల్ కిల్లర్, స్త్రీలోలుడు, ప్రముఖులకు అమ్మాయిలను సప్లయ్ చేసే బ్రోకర్.
ఇలా శంకర్‌లో ఎన్నో కోణాలున్నాయి. హత్యలు, రౌడీయిజమే మెట్లుగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న గ్యాంగ్ లీడర్. సోదరుడు మోహన్, బావమరిది ఎడిన్, శివాజీ, జయవేలు, రాజారమన్, రవి, పలనీ, పరమశివమ్‌లు ఆటోశంకర్ గ్యాంగ్‌లో సభ్యులు. 1988వ సంవత్సరంలో తమిళనాడు ప్రజలని వణికించాడు. చింతనిప్పుల్లాంటి అతడి కళ్ల వెనుక దాగున్న క్రూరత్వాన్ని ఎవరూ అంచనా వేసేవారు కాదు. ఆటో డ్రైవర్ అయిన శంకర్ నాటుసారాను తన ఆటోలో సరఫరా చేసేవాడు. ఈ క్రమంలోనే అతడికి పలువురు వేశ్యలతో పరిచయాలు ఏర్పడ్డాయి. మహాబలిపురం నుంచి మద్రాసు నగరం వరకు విటులకు తన ఆటోలోనే వేశ్యలను సరఫరా చేయడం మొదలుపెట్టాడు.

ఆ తర్వాత జరిగిన కొన్ని పరిస్థితులకి చలించిపోయాడు. తొలిసారిగా క్యాబరే డాన్సర్ లలితను చూసి మనసు పారేసుకున్నాడు. తన అంగ, అర్ధ బలంతో ఆమెను లోబరుకుని ప్రేయసిగా మార్చుకున్నాడు. అతడి వేధింపులు భరించలేకపోయిన లలిత కొద్దిరోజులుగా సుదలైముత్తు అనే వ్యక్తితో పారిపోయింది. దీన్ని అవమానంగా భావించి రగిలిపోయిన శంకర్ తన గ్యాంగ్‌తో వారిద్దరిని వెతికి పట్టుకుని తన డెన్‌లో కిరాతకంగా చంపేశాడు. ఇద్దరి శవాలను దహనం చేసి ఆధారాలు దొరక్కుండా అస్థికలను బంగాళాఖాతంలో కలిపాడు. అయితే ఆయన లైఫ్‌పై “ఆటో శంకర్” వెబ్ సిరీస్ చేశాడు.. ఈ సిరీస్ ప్రస్తుతం జీ5 లో తెలుగులో అందుబాటులో ఉంది. మొత్తం పది ఎపిసోడ్స్ గా ఉన్న ఈ సిరీస్ చూస్తే.. దీనికి మించిన రియలిస్టిక్ సిరీస్ ఇంకోటి ఉండదేమో అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది.