మొబైల్స్ తయారీదారు ఒప్పో భారత మార్కెట్‌లో మరో నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రెనో 8 ప్రొ పేరిట విడుదలైన ఈ ఫోన్‌లో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఈ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్ లభిస్తుంది. 256 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. 5జి, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లను ఈ ఫోన్‌లో పొందవచ్చు. దీంట్లో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
ఇక ఒప్పో రెనో 8 ప్రొ స్మార్ట్ ఫోన్ గ్లేజ్డ్ గ్రీన్, గ్లేజ్డ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. దీన్ని రూ.45,999 ధరకు విక్రయిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనిపై పలు బ్యాంకులకు చెందిన కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ను, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు.