Nysa Devgan : బాలీవుడ్ లో వారసురాళ్ల హవా జోరుగా సాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. జాన్వీ కపూర్,సారా అలీఖాన్,అనన్యా పాండే వంటి భామలు ఇప్పటికే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రేసులో దూసుకుపోతున్నారు. ఖుషీ కపూర్, సుహానా ఖాన్, షానాయ కపూర్, ఇరా ఖాన్, నవ్య నవేలి నందా లాంటి యువ భామలు త్వరలో తమ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే అజయ్ దేవగణ్-కాజోల్ అగర్వాల్ ముద్దుల కుమార్తె నైసా దేవగణ్ కూడా బాలీవుడ్ పరిచయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ అప్పుడప్పుడు ప్రకంపనలు రేపుతూ ఉంటుంది.
అమెరికాలో చదువు పూర్తి చేసుకొని ఇటీవలే నైసా ఇండియాకొచ్చింది. రావడం రావడమే అమెరికా కల్చర్ ని ఇక్కడ ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది. విదేశీ బ్యూటీల తరహాలో తన ఛామ్ ని చూపించాలని ఛాన్స్ దొరికినప్పుడల్లా ట్రై చేస్తూ ఉంటుంది. తరుచూ సెలబ్రిటీ పార్టీలకు తప్పక హాజరవుతుంది. స్టార్ కిడ్స్ తో యాక్టివ్ గా పాల్గొంటుంది. పార్టీ డ్రెస్సులతోనే హీరోయిన్ మెటీరియల్ అని ఇండైరెక్ట్ గా చెప్పకనే చెబుతుంది. స్టార్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉంది కాజోల్ కూతురు నైసా. అమ్మ కన్నా ఎత్తు పెరిగి అందంగా మెరిసిపోతోంది నైసా.
![Nysa Devgan : కైపెక్కించే చూపులతో కాక రేపుతున్న కాజోల్ కూతురు..! Nysa Devgan latest photos with kajol viral on social media](http://3.0.182.119/wp-content/uploads/2023/04/nysa-devgan.jpg)
తాజాగా తల్లి కూతుళ్లు ఇద్దరు అదిరిపోయే ఫొటో షూట్ తో అదరగొట్టారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా బాలీవుడ్ ముద్దుగుమ్మ కాజోల్ అందాలు ఏ మాత్రం తగ్గలేదు . తన అందచందాలతో ఒకప్పుడు బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. తన కుమార్తె నైసా ను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు రెడీ అవుతుంది. తాజాగా తల్లి కూతురు ఫోటో షోలో అలరించగా, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నటన పరంగా నైసాకి ట్రైనర్ అవసరం లేదు. ఇంట్లో తల పండిన ట్రైనర్ మామ్ ఉండగా, డాడ్ అజయ్ దేవగణ్ సూచనలు..సలహాలు వెనుక నుంచి ఎలాగూ ఉంటాయి కాబట్టి నైసా త్వరలో బాలీవుడ్‌ని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.