Naresh Pavitra Lokesh : గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో పవిత్ర, నరేష్‌లకి సంబంధించి అనేక ఫొటోలు, వీడియోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లు డిసెంబర్ 31వ తేదీన అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటూ రిలీజ్ చేసిన వీడియో ఎంతగా నెట్టింట హల్‌చల్ చేసిందో మనం చూశాం.. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజిలో చర్చలు నడిచాయి. నరేష్ తన భార్య రమ్యతో విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులో ఉండగా.. నరేష్ పెళ్లి ఎలా చేసుకుంటారనే ప్రశ్నలు వచ్చాయి. అయితే అదీ నిజం కాదు అన్నారు.
ఇక దీని గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనే నరేష్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగినట్టు కనిపించింది. మూడు ముళ్లు వేసి.. ఏడు అడుగులు నడిచినట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. మూడు ముళ్లు.. ఏడు అడుగులకు మీ ఆశీర్వాదం కావాలంటూ కామెంట్ కూడా పెట్టారు.. దీంతో అందరూ నిజంగా పెళ్లి అయిపోయినట్లు భావించారు. అయితే కొందరు మాత్ర ఇది సినిమా ప్రమోషన్ అని కొట్టిపడేశారు. అయితే వీటన్నింటి వెనుక ఎంఎస్ రాజు ఉన్నట్టు తెలుస్తుంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మరకుపవిత్రతో కలిసి నరేష్ ‘సెకండ్ ఇన్నింగ్స్’ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ మధ్య బోల్డ్ సినిమాలు మొదలు పెట్టి దూకుడుగా డైరెక్ట్ చేస్తున్న ఎమ్మెస్ రాజు ఓ సినిమా చేస్తుండగా, ఈ సినిమా కథ ప్రకారం…మొదటి పెళ్లి విఫలమైన ఓ జంట కలిసి సహజీవనం చేస్తూ పెళ్లి పీటలు ఎక్కడమే అంటున్నారు. ఈ సినిమాకు నరేష్ నే నిర్మాత. అందుకే ఈ రేంజ్‌లో వీడియోలు వదులుతున్నారు. త్వరలోనే ‘సెకండ్ ఇన్నింగ్స్’ టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి త్వరలోనే ప్రమోషన్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో పవిత్రా నరేష్ మధ్య బోల్డ్ సీన్స్ ఉంటాయని , ఎమ్మెస్ రాజు ప్రీవీయస్ మూవీస్ లో ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న రొమాంటిక్ మోతాదు కూడా ఎక్కువగానే ఉండనుందని తెలుస్తుంది.