Namrata Shirodkar : సెలబ్రిటీలు ఎంత వయసొచ్చిన కూడా చాలా యంగ్‌గా కనిపిస్తారు. అందుకు కారణం వారు చేసే వర్కవుట్స్, తినే తిండి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికీ ఎంతో అందంగా, కుర్రాడిలా కనిపిస్తుంటారు. ఇక ఆయన భార్య నమ్రత శిరోద్కర్ అందం విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటుంది.. వ్యాయామం ఆమె దినచర్యలో భాగంగా ఉంటుంది. 51 ఏళ్ల నమ్రత కఠిన నియమాలు పాటించి యంగ్ లుక్ మైంటైన్ చేస్తున్నారు. జిమ్ ట్రైనర్ పర్యవేక్షణలో నమ్రత కసరత్తులు చేస్తుంటుంది. రీసెంట్‌గా నమ్రతకి సంబంధించిన వర్కవుట్ వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేసింది. అయితే గతంలో నమ్రత చేయని పుల్ అప్స్, స్విస్ బాల్ ప్లాంక్, రోల్ అవుట్ ఎక్సర్సైజులు ఆమె చేశారట.
ట్రైనర్ కుమార్ మన్నవ ఆమెకు సహనంగా శిక్షణ ఇచ్చారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ నమ్రత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఈ వీడియో చూసి నమ్రత బ్యూటీ సీక్రెట్ ఇదా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నమ్రత పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇంటి బాధ్యతలు,బిజినెస్ వ్యవహరాలు చూసుకుంటుంది. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాలంటే సింపుల్ గా మహేష్-నమ్రతలను చూపిస్తే సరిపోతుంది. అంత గొప్ప అన్యోన్య దాంపత్యం వారిది. ముంబైలో పుట్టిన పెరిగిన ఒక అల్ట్రా మోడ్రన్ హీరోయిన్ తెలుగింటి కోడలు కావడం, ఇక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి.
![Namrata Shirodkar : జిమ్‌లో నమ్రత కసరత్తులు.. బాబోయ్ ఆమె కష్టం మాములుగా లేదు..! Namrata Shirodkar gym training session video viral](http://3.0.182.119/wp-content/uploads/2023/05/namrata-shirodkar.jpg)
నమ్రత పరిపూర్ణమైన గృహిణిగా అందరి ప్రశంసలు అందుకుంటుంది.. పెద్దవారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సాంప్రదాయంగా నమ్రత ఉంటారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన నమ్రత వాళ్ళ ఆలనా పాలనా చూసుకున్నారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మహేష్ కెరీర్ పై ఆమె ఫోకస్ పెట్టారు. మహేష్ కి మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. మహేష్ బాబు సక్సెస్ లో నమ్రత పార్ట్ తప్పక ఉంటుందనేది అక్షర సత్యం. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉండగా, ఈ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు.
View this post on Instagram