టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు నాగార్జున, వెంకటేష్. ఈ ఇద్దరు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. అయితే ఇండస్ట్రీలో ఓ హీరో చేయని మరో హీరో చేసి మంచి విజయాలు సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా వెంకటేష్ వదులుకున్న మూవీని నాగార్జున చేసి మంచి హిట్ కొట్టాడు . అదే మూవీ అనుకుంటున్నారా సంతోషం. డైరెక్టర్ దశరథ్ సంతోషం సినిమా కథను మొదట వెంకీకి చెప్పాడట. కానీ వెంకటేష్ ఈ సినిమా కథ నచ్చకపోవడంతో పక్కన పెట్టేసాడు. ఇక అదే కథలో నాగార్జున హీరోగా నటించి బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు.
అక్కినేని నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియా శరన్ ప్రధాన పాత్రలలో నటించిన సంతోషం సినిమా 2002లో విడుదలైన సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో డైరెక్టర్ కె. విశ్వనాథ్, ప్రభుదేవా కీలకపాత్రలలో నటించారు. సంతోషం సినిమా ద్వారా దశరథ్ అనే ఓ కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగ్. ఏకంగా అతనికోసం ఓ ఎనిమిది నెలల పాటు మేకప్ వేసుకోకుండా ఉన్నారు నాగార్జున. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మించిన ఈ సినిమా 2002 మే 9న విడుదలై ఘనవిజయం సాధించింది.
ముందుగా నాగార్జునతో ఓ సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు నిర్మాతలు పి.ఎల్.నారాయణ, ఎస్ గోపాలరెడ్డి.. నాగార్జున డేట్స్ కూడా ఇచ్చేశాడు..కానీ వారి వద్ద కథ లేదు.. ఈ క్రమంలో నువ్వు నును సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దశరథ్ వద్ద ఓ కథ ఉండడంతో నటుడు బెనర్జీ నిర్మాతలు పి.ఎల్. నారాయణ, ఎస్.గోపాలరెడ్డిల వద్దకి తీసుకెళ్ళి కథను వినిపించారు..ముందుగా ఆ కథను తరుణ్ తో చేయాలనీ అనుకున్నారు.. కానీ తరుణ్ బిజీగా ఉడడంతో మరో యాక్షన్ కథను వినిపించారు దశరథ్.. అది వారికి బాగా నచ్చి నాగార్జునకి కూడా వినిపించారు. హిందీ సినిమా హమ్ దిల్ దే చుకే సనమ్లో కథానాయకుడు అజయ్ దేవ్ గణ్ పాత్రలాంటి క్యారెక్టరైజేషన్ నాగార్జున పాత్రకు ఉంటే బావుంటుందని అనుకున్న దశరథ్ అలా ఓ స్టోరీ లైన్ అనుకోని మొత్తం కథని ఓ వారంలో ఫినిష్ చేశారు. లైన్ నాగార్జునకి బాగా నచ్చడంతో మిగతా స్క్రిప్ట్ అంతా ఫినిష్ చేశారు.