Nadendla Manohar : జనసేన నేత నాదెండ్ల మనోహర్.. జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని ఎత్తి చూపితూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు విదేశీ విద్య పేరిట దోపిడీకి తెరతీసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. టోపెల్ శిక్షణ పేరిట ఈటీఎస్ సంస్థకు ఏటా రూ.1040 కోట్లు దోచి పెట్టడానికి సిద్ధమైందన్నారు. ఏటా అమెరికా వీసా పొందే తెలుగు విద్యార్థులు 40 వేల మంది మాత్రమే అని.. కానీ ప్రభుత్వం లక్షలాది మందికి శిక్షణ ఇచ్చేది ఎందుకు అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ప్రజల్ని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా మరోసారి మోసానికి సిద్ధమైందని మండిపడ్డారు సీఎం హెలికాప్టర్లో తిరుగుతూ ఎస్సీ, ఎస్టీ , బీసి నేతలను బస్సుయాత్ర చేయాలని ఆదేశించారన్నారు.
బస్సు యాత్రలో జగన్ రెడ్డి కూడా పాల్గొనాలని.. రాష్ట్రం లో రోడ్లు దుస్థితి ప్రత్యక్షంగా చూడాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రతిపక్ష నేతలను విమర్శించడం కోసమే సీఎం పర్యటనలు అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం మాత్రం టోఫెల్ పరీక్షను మూడో తరగతి నుంచి పదవ తరగతి చదివే పిల్లలకు ఈ ఏడాది నుంచి 2027 వ సంవత్సరం చివరి వరకు ఈ పరీక్షను అన్ని తరగతుల వారీగా నిర్వహించేలా ఈటీఎస్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని, దీనికోసం ప్రతి ఏటా రూ.1052 కోట్లు ఖర్చు చేయనున్నారని చెప్పారు. నాలుగు సంవత్సరాలకు కలిపి సుమారుగా రూ.4 వేల కోట్లకు పైబడి ఈ పథకంలో ఖర్చు చేయనున్నారని వివరించారు.
![Nadendla Manohar : జగన్‌పై విరుచుకుపడ్డ నాదెండ్ల.. పవన్ పెళ్లాలతో నీకెం నొప్పి అంటూ ఫైర్.. Nadendla Manohar angry comments on cm ys jagan](http://3.0.182.119/wp-content/uploads/2023/10/nadendla-manohar.jpg)
రాష్ట్రంలో ఉన్న 1.81 లక్షల ఉపాధ్యాయుల్లో కేవలం 1200 మంది మాత్రమే ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఉన్నారని, వారు ఈ పథకంలో పిల్లలకు ఎలా ఉపయోగపడతారని ప్రశ్నించారు. ఇంగ్లీషు రాని ఉపాధ్యాయులు పరీక్షకు పిల్లలను ఎలా సమాయత్తం చేస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అన్నారు. ఎవరైన తప్పుని చూపిస్తే దానిపై విమర్శలు చేయడం, పర్సనల్ అటాక్ చేయడం వంటివి జగన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పవన్ పెళ్లిళ్లపై జగన్ చేసిన కామెంట్స్ కి ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గట్టిగానే ఇచ్చిపడేస్తున్నట్టు అర్ధమవుతుంది.