Manchu Lakshmi : మంచు మోహన్ బాబు నట వారసురాలిగా గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మీ నటిగా, హోస్ట్‌గా, నిర్మాతగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.అమెరికాలో ఏళ్ల తరబడి ఉన్న మంచు లక్ష్మి ఆలోచన పాశ్చాత్యులను తలపిస్తాయి. ఆమె హీరోయిన్ రేంజ్ లో ఫోటో షూట్స్ లో పాల్గొంటారు. హీరోయిన్ కావాలని చాలా ప్రయత్నం చేసిన మంచు లక్ష్మి ఈ మధ్య క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పలు టాక్ షోలకి గెస్ట్‌గా వ్యవహరిస్తున్న మంచు లక్ష్మీ .. అనుష్క గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ టీవీ షో కోసం స్వీటీని తాను గెస్ట్ గా పిలిచానని.. అయితే చివరి నిమిషం వరకు అనుష్క తనను చాలా కంగారు పెట్టిందని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మీ.
మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. నేను నా షోకు వచ్చే గెస్ట్‌లకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఒకసారి ఇలానే అనుష్కను నా షోకి గెస్ట్‌గా పిలవగా, ఆ సమయంలో చాలా టెన్షన్ పెట్టింది. ‘భాగమతి’ సినిమా ప్రమోషన్స్‌లో రాజమండ్రి ఎక్కడికో వెళ్లి చిక్కుకుపోయింది. షోకు టూ డేస్ ముందు నాతో టచ్‌లో లేదు. దీంతో నాకు కంగారు మొదలైంది. షోకు వస్తుందా? రాదా? అని ఒకటే టెన్షన్ పడిపోయాను. తన ఇంటికి ఫ్లవర్స్ కూడాపంపిచాను. తన బెస్ట్ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేశాను. ఇలా చాలా రకాలుగా తనను కలిసేందుకు ప్రయత్నించాను. అనుష్క తిరిగి ఇంటికి వచ్చేసరికి నా మెసేజ్‌లతో ఆమె ఫోన్ నిండిపోయింది.
అవి చూసి అనుష్క నాకు కాల్ చేసి.. నేను వస్తానని చెప్పానుగా అని అంది. నేను కంగారు పడ్డాను అందుకే అలా చేశాను అని చెప్పాను. కానీ షో మనం హోస్ట్ చేసినప్పుడు గెస్ట్‌లను ఇలానే చూసుకోవాలి. హే రావే షోకి అని అనలేం కదా.. అలా పిలిస్తే వచ్చే వాళ్లు.. ఇద్దరు ముగ్గురు ఉన్నారు. రాణా, రకుల్, తాప్సీలను రండి అంటే వచ్చేస్తారు. కానీ మిగిలిన వాళ్లు అలా కాదు అంటూ మంచు లక్ష్మీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇక టాక్ షోస్ అంటే తనకి బోర్ వచ్చేసిందని, అడిగిన ప్రశ్నలే ఎన్ని సార్లు అడుగుతామంటూ మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.