మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో కీరదోస ఒకటి. కూరగాయ అన్నమాటే కానీ దీంతో మనం కూరలను చేయం. నేరుగానే తింటుంటాం. దీన్ని రైతాలో ముక్కలుగా చేసి వేస్తారు. దీంతో చక్కని రుచి వస్తుంది. కీరదోసను నేరుగా పచ్చిగానే తింటారు. అయితే వాస్తవానికి ఇది అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. కనుక దీన్ని మనం రోజూ తినవచ్చు. కీరదోసను తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
కీరదోసను తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చు. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వంటివి బాధించవు. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. షుగర్, బీపీ నియంత్రణలోకి వస్తాయి. అయితే వేసవిలో దీన్ని అధికంగా తీసుకుంటారు. కానీ వాస్తవానికి కీరదోసను రోజూ తినవచ్చు. ముఖ్యంగా కొందరికి సీజన్లతో సంబంధం లేకుండా శరీరం మొత్తం వేడి అవుతుంది. అలాంటి వారు కీరదోసను తినాలి.
ఇక కీరదోసను నేరుగా రోజూ తినడం కష్టం అవుతుంది. అలాంటి వారు కీరదోసను జ్యూస్‌గా చేసుకుని తాగవచ్చు. దీంతో ఎంతో సులభంగా వీటిని తీసుకోవచ్చు. ఈ క్రమంలోనే పైన తెలిపిన అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఇక కీరదోస జ్యూస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కీరదోస జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చల్లని పెరుగు – 270 గ్రాములు, కీరదోస పేస్ట్ – 200 గ్రాములు, కట్ చేసిన టమాటాలు – 10 గ్రాములు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – తగినంత.
కీరదోస జ్యూస్‌ను తయారు చేసే విధానం..
పైన చెప్పిన అన్ని పదార్థాలను బాగా కలిపి మిక్సీ పట్టాలి. జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొంత నీరు కలపవచ్చు. దీంతో కీరదోస జ్యూస్ తయారవుతుంది. ఉప్పు, మిరియాల పొడిలను టేస్ట్‌కు సరిపడా కలుపుకుంటే చాలు. చల్ల చల్లని కీరదోస జ్యూస్ రెడీ అయినట్టే. దీన్ని రోజూ మధ్యాహ్నం సమయంలో తాగితే ఎక్కువ ఫలితం లభిస్తుంది. లేదా రాత్రి నిద్రకు ముందు అయినా తాగవచ్చు. దీంతో తెల్లారేసరికి శరీరం మొత్తం శుభ్రంగా మారుతుంది. వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. ఇలా కీరదోస జ్యూస్ మనకు ఎంతగానో మేలు చేస్తుంది.