నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లక్ష్మీనరసింహ, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం ఈ రెండు సినిమాలు 2004 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఒకే రోజు రిలీజై సందడి చేశాయి. ఇద్దరి ఫ్యాన్స్ భీభత్సంగా హడావిడి చేశారు. ఇందులో బిగ్గెస్ట్ అందుకున్న సినిమా వివరాల్లోకి వెళ్తే.. సంక్రాంతికి బాలయ్యకు పేరు వచ్చినప్పటికీ లాంగ్ రన్ లో వర్షం మూవీ ప్రభాస్ కి పేరు తెచ్చిపెట్టింది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన లక్ష్మీ నరసింహ మూవీకి జయంత్ సి పరాన్జీ డైరెక్టర్.
భారీ అంచనాలతో 450 సెంటర్స్ లో రిలీజైన లక్ష్మీ నరసింహ మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తొలివారం రూ.10 కోట్ల వరకూ షేర్ తెచ్చిన ఈ మూవీ 277 సెంటర్స్ లో 50 రోజులు, 86 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది. ఇక ఇదే రోజు వచ్చిన వర్షం మూవీని ఎం ఎస్ రాజు నిర్మించారు. శోభన్ డైరెక్టర్. 200 సెంటర్స్ లో రిలీజై 165 సెంటర్స్ లో 50 రోజులు, 68 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది. రూ.18 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది.
అయితే లక్ష్మీ నరసింహ మూవీ 100 డేస్ కి వచ్చేసరికి సెంటర్స్ తగ్గిపోవడంతో నిర్మాత బెల్లంకొండ తప్పిదం అయింది. బాలయ్యతో విభేదాలు, ప్రమోషన్స్ పై శ్రద్ధపెట్టకపోవడం వంటి కారణాల వలన ఈ సినిమా లాంగ్ రన్ దెబ్బతింది. రూ.16.50 కోట్ల షేర్ తెచ్చింది. షేర్ విషయంలో పెద్దగా తేడా లేకున్నా లాంగ్ రన్ లో వర్షం కన్నా లక్ష్మీ నరసింహ వెనుకబడింది. లవ్ సెంటిమెంట్ తో వర్షం, పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో లక్ష్మీ నరసింహ తెరకెక్కాయి. వర్షం సాంగ్స్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా, లక్ష్మీ నరసింహ పాటలను మణిశర్మ కంపోజ్ చేశాడు. ఈ రెండు మూవీలకు చెందిన సాంగ్స్ బాగానే అలరించాయి. ఇక ఈ రెండింటిలో వర్షం బాగా హిట్ అయిందని చెప్పవచ్చు.