Krishna Vijayanirmala : తెలుగు సినీ పరిశ్రమ అగ్ర నటుల్లో కృష్ణ ఒక్కరు. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపయోగపడింది. ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు కృష్ణ.
మరోవైపు హాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కౌబాయ్ సినిమాలను టాలీవుడ్ కు కూడా పరిచయం చేసారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో విజయనిర్మల ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. హిట్ పెయిర్ కొనసాగుతున్న వీరిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గా ప్రేమించుకున్నారు. అయితే అప్పటికే కృష్ణకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మలను గుడిలో పెళ్లి చేసుకున్నారు.
![Krishna Vijayanirmala : కృష్ణ, విజయ నిర్మల పెళ్లికి ఇందిరని ఎవరు ఒప్పించారో తెలుసా..? Krishna Vijayanirmala marriage who asked indira devi to agree](http://3.0.182.119/wp-content/uploads/2022/11/krishna-vijaya-nirmala-indira.jpg)
అయితే కృష్ణ విజయనిర్మల వివాహం గురించి ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కృష్ణ విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న తర్వాత తమ తల్లి గారు చాలా కాలం పాటు అంగీకరించలేదని చెప్పారు. కృష్ణ భార్య గారు తన వదిన ఇందిర గారికి తానే సర్ది చెప్పానని ఆదిశేషగిరిరావు చెప్పారు. కృష్ణకు విజయనిర్మల చేదోడువాదోడుగా ఉండేవారని సినిమాల విషయంలో ఎంతో సపోర్ట్ ఇచ్చేవారని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే విజయనిర్మల 2019లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.