ఆచార్య చిత్రం విడుదల కాకముందు 100% సక్సెస్ రేట్ సాధించిన అతికొద్ది మంది టాలీవుడ్ దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఎన్నో భారీ అంచనాల నడుమ చిరంజీవి హీరోగా ఆచార్య చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 29న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం దర్శక నిర్మాతల అంచనాలను తారుమారు చేస్తూ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాతలు మరియు డిస్టర్బ్యూటర్లతో సహా కొరటాల శివకి కూడా భారీ నష్టం తెచ్చిపెట్టింది.
ఇదివరకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఈ చిత్రం విడుదలైన తర్వాత అదృశ్యమయ్యాడు. అలాగే మీడియా దృష్టి నుంచి తప్పించుకున్నాడు అనే వార్త ప్రస్తుతం బాగా ప్రచారం అవుతుంది. మరోవైపు చిరంజీవి ఆచార్య ఫెయిల్యూర్‌పై చర్చించినప్పుడల్లా కొరటాల మీద నిందలు మోపుతున్నారు. ముఖ్యంగా గాడ్ ఫాదర్ చిత్రం ప్రమోషన్స్ సమయంలో చిరంజీవి చేసిన కామెంట్స్ కి కొరటాల మాత్రం తనపై చేసిన ఆరోపణలపై ఏమీ మాట్లాడలేదు. అంతేకాకుండా కొరటాల మాత్రం తనపై ఎలాంటి ప్రకటనలు చేసినా స్పందించకుండా మౌనంగానే ఉన్నారు.
కొరటాల ఆచార్య చిత్ర సమయంలో అల్లు అర్జున్ నటించబోయే సినిమాను ప్రకటించారు. కానీ ఇప్పుడు దానిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. ఈ ఏడాది మొదట్లో జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ ప్రాజెక్ట్‌ను వెల్లడించాడు. ఎన్టీఆర్ 30 అని తాత్కాలికంగా టైటిల్ పెట్టబడిన ఈ సినిమా ప్రస్తుతం తెరకెక్కింది. ఇక ఎన్టీఆర్ 30 కూడా హోల్డ్‌లో పెట్టినట్లు గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లను తిరస్కరిస్తూ దర్శకుడు కొరటాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రత్నవేలు మరియు ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పనిని ముమ్మరం చేసినట్లు ఇటీవల ప్రొడక్షన్ టీమ్ సన్నిహితులు పేర్కొన్నారు.
ఇక మీడియాకు కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అని ప్రచారం అయ్యే వార్తపై కొరటాల మౌనాన్ని విడిచి స్పందించవలసిన సమయం ఆసన్నమైంది. అతను ఒక టాప్ డైరెక్టర్ మరియు ఈ పుకార్లు అనేవి కొరటాల శివ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఆయన మౌనం వీడి ప్రస్తుతం జరుగుతున్న పుకార్లపై స్పందించాలని ఆయన అభిమానులు మరియు శ్రేయోభిలాషులు ఎదురుచూస్తున్నారు.