Kantara Movie : ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ చిత్రం కాంతార బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టిస్తుంది. కన్నడ వెర్షన్ విడుదలై మూడు వారాలు గడుస్తున్న నేపథ్యంలో 103 కోట్ల రూపాయల నెట్ వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతోంది. కేజీఎఫ్ 2, కేజీఎఫ్ సినిమాల తర్వాత ఈ స్థాయి వసూళ్లను అందుకున్న కన్నడ సినిమా ఇదే . రిషభ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ బడా బడా మూవీ మేకర్స్‌ను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్ల వసూళ్ల సునామి సృష్టిస్తుంది.
మూడు రోజులకే కాంతార డబుల్ బ్లాక్ బస్టర్ గా అవతరించింది. వీకెండ్ ఘనంగా ముగించిన కాంతార వర్కింగ్ డే సోమవారం కూడా అదే జోరు కనబరిచింది. ఏపీ/తెలంగాణాలలో కాంతార మూడవ రోజు రూ. 1.90 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇది ఓపెనింగ్ డే షేర్ కి చాలా దగ్గరగా ఉంది. ఫస్ట్ డే కాంతార రూ. 2.10 షేర్ రాబట్టింది. సెకండ్ డే ఆదివారం ఫస్ట్ డేకి మించిన వసూళ్లు దక్కాయి. రెండవ రోజు రూ. 2.80 షేర్ అందుకుంది.మూడు రోజులకు ఏపీ/తెలంగాణాలలో కలిపి రూ. 6.80 కోట్ల షేర్, రూ. 13.5 కోట్ల గ్రాస్ రాబట్టింది.
కాంతార హవా చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంతార తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా ఐఎండీబీ ప్రకటించిన టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్ జాబితాలో కాంతార ఏకంగా మొదటి జాబితాలో నిలవగా, టాలీవుడ్ హిట్ చిత్రాలైన బాహుబలి: ది కన్‌క్లూజన్(101), బాహుబలి: ది బిగినింగ్(182), ఆర్ఆర్ఆర్(190) స్థానాల్లో నిలిచాయి. ప్రేక్షకులకు ఇచ్చే రేటింగ్స్ ఆధారంగా ఐఎండీబీ ఈ జాబితాను రూపొందిస్తుందనే విషయం మనందరికి తెలిసిందే. ఏదేమైన కాంతారకి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం గొప్ప విషయం అనే చెప్పాలి. కాంతార అర్ధం తెలికపోయిన అందులోని నటీనటులు మనకు పరిచయం లేకపోయిన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి పట్టం కట్టారు.