IND Vs AUS : సిరీస్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ అద్భుతమైన ఆట తీరుతో రెండో టీ 20లో భారత్ మంచి విజయాన్ని అందుకుంది. చిత్తడి వాతావరణం కారణంగా అంపైర్స్ ఓవర్స్ కుదించారు. ఇరు జట్లు 8 ఓవర్స్ మాత్రమే ఆడేలా నిర్ణయించారు. వర్షం వల్ల ఎనిమిది ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. పిడుగుల్లాంటి షాట్లని ఫ్యాన్స్‌కి చూసే అవకాశం దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓవర్‌కు 11కు పైగా రన్‌రేట్‌తో ఎనిమిది ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ మ్యాథ్యూ వేడ్ (20 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి సూపర్ ఇన్నింగ్స్ తో రెచ్చిపోగా, ఓపెనర్ ఫించ్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ అంతా నిరాశపరిచారు. అయితే భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు. బుమ్రా ఒక వికెట్ తీశాడు. ఇక 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 7.2 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 91 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్ రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సునామి ఇన్నింగ్స్ ను ఆడాడు.
![IND Vs AUS : నిన్నటి మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ విన్నింగ్ షాట్స్ చూశారా.. ఎలా కొట్టాడంటే.. వీడియో..! IND Vs AUS India won by 6 wickets against Australia in 2nd T20](http://3.0.182.119/wp-content/uploads/2022/09/ind-vs-aus-2nd-t20.jpg)
మొదటి నుండి బంతిని బౌండరీకి తరలించే పని పెట్టుకున్న రోహిత్ శర్మ స్కోర్ బోర్డ్‌ని పరుగులు పెట్టించాడు. మైదానం నలుమూలల భారీ షాట్స్ ఆడుతూ అలరించాడు. ఒకవైపు వికెట్స్ పడుతున్నా కూడా రోహిత్ అద్భుతమై ఆటతీరుతో భారత్‌ని గెలిపించాడు. చివరి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా.. అప్పుడే క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (2 బంతుల్లో 10 నాటౌట్; 1 సిక్స్, ఒక ఫోర్) వరుసగా 6, 4 కొట్టి మ్యాచ్ ను ముగించేశాడు. దీంతో సిరీస్ సమం అయింది. చివరి టీ 20 హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో వారికి సిరీస్ దక్కనుంది.
WHAT. A. FINISH! 👍 👍
WHAT. A. WIN! 👏 👏@DineshKarthik goes 6 & 4 as #TeamIndia beat Australia in the second #INDvAUS T20I. 👌 👌@mastercardindia | @StarSportsIndia
Scorecard ▶️ https://t.co/LyNJTtkxVv pic.twitter.com/j6icoGdPrn
— BCCI (@BCCI) September 23, 2022