GPay PhonePe: యూపీఐ (Unified Payment Interface-UPI) గురించి ఈ రోజుల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. చెల్లింపులకు సంబంధించిన ఈ లావాదేవీ ప్రక్రియను ఈ రోజుల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఇది ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తుంది. మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా ఈ పేమెంట్స్ చేయవచ్చు. UPI ద్వారా డబ్బును 24X7 బదిలీ చేసుకునే సదుపాయముంది. ఈ క్రమంలో చెల్లింపు సమయంలో చేసే చిన్న పొరపాట్ల వల్ల తప్పుడు వ్యక్తుల బ్యాంక్ ఖాతాలకు డబ్బు పంపే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భంలో ఆ డబ్బును ఎలా రికవర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించండి: మీరు UPI చెల్లింపుల సమయంలో తప్పుడు ఖాతాకు డబ్బు ట్రాన్ఫర్ చేసినట్లయితే భయపడాల్సిన పనిలేదు. తప్పు లావాదేవీ జరిగితే, ముందుగా దాని వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ పేమెంట్ మెసేజ్ లో ఉన్న హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి రిపోర్ట్ చేయండి. అదే సమయంలో ఈ వివరాలను బ్యాంక్ కు కూడా తెలపండి. వీలైనంత త్వరగా బ్రాంచ్ మేనేజర్‌ని సంప్రదించండి. సందేహాలు లేదా ఫిర్యాదులతో BHIM టోల్-ఫ్రీ నంబర్ 18001201740ని సంప్రదించడం. బ్యాంకును సంప్రదించటం: డబ్బును మీరు తప్పుడు వ్యక్తి ఖాతాకు బదిలీ చేసి ఉంటే.. దాని వివరాలతో మీ బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. ఇది ఇంటర్ బ్యాంక్ లావాదేవీ అయితే.. అంటే, రెండు వేర్వేరు బ్యాంకుల మధ్య లావాదేవీ జరిగినట్లయితే.. సమీపంలోని బ్రాంచ్ ను రిసీవరీ కోసం సంప్రదిస్తుంది.
7 రోజుల్లో డబ్బు వాపసు పొందవచ్చు: పొరపాటున డబ్బు పొందిన వ్యక్తి దానిని తిరిగి ఇచ్చేందుకు అంగీకరిస్తే.. 7 పని దినాల్లో డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి ఖాతాకు తిరిగి వస్తుంది. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా లేకుంటే మరింత ఇబ్బంది ఉంటుంది. ఈ సందర్భంలో.. చట్టపరమైన మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. అయితే కస్టమర్ ఆమోదం లేకుండా.. ఏ బ్యాంకు అతని ఖాతా నుంచి డబ్బును బదిలీ చేయదు, అది నిజంగా పొరపాటున జరిగినప్పటికీ. కాబట్టి డిజిటల్ చెల్లింపులు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు వివరాలు సరిచూసుకోవటం ఉత్తమం.