Ginger Garlic Paste : మనం ఎంతో పురాతన కాలం నుంచే అల్లం, వెల్లుల్లి రెండింటినీ ఉపయోగిస్తున్నాం. ఇవి వంట ఇంటి పదార్థాలుగా ఉన్నాయి. వీటిని రోజూ కూరల్లో వేస్తుంటాం. దీంతో కూరలకు చక్కని వాసన, రుచి వస్తాయి. అయితే ఈ రెండింటిలోనూ ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అల్లం, వెల్లుల్లిని విడి విడిగా తీసుకోవడం కన్నా వీటిని కలిపి పేస్ట్‌లా చేసి తింటే ఇంకా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను రోజూ అర టీస్పూన్ మోతాదులో తినాలి. దీన్ని ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను రోజూ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఈ రెండింటిలోనూ శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అలాగే అల్లంలో జింజెరోల్స్ అని పిలవబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి నొప్పులను, వాపులను తగ్గిస్తాయి. ఈ సమస్యలతో రోజూ సతమతం అయ్యే వారు రోజూ కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తినాలి. దీంతో నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ అదుపులోకి వస్తుంది. కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీని వల్ల గుండె జబ్బులు రావు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి.
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తినడం వల్ల రక్తం పలుచగా మారుతుంది. దీంతో రక్త సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా నివారించవచ్చు. దీంతో హార్ట్ స్ట్రోక్స్ రావు. అలాగే ఈ పేస్ట్‌ను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. దీంతో చురుగ్గా పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఈ పేస్ట్‌ను తినడం వల్ల ముక్కు, గొంతు, ఛాతిలో ఉండే కఫం మొత్తం కరిగిపోతుంది. దీంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గుతాయి. ఈ పేస్ట్ వల్ల జీర్ణ సమస్యలు కూడా ఉండవు. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ నుంచి బయట పడవచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను రోజూ అర టీస్పూన్ మోతాదులో తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.