Gautam Krishna And Sitara : టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో నవంబర్ 15 తెల్లవారుఝామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. గుండెపోటు, శ్వాస ఇబ్బందులతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణ అడ్మిట్ అయ్యారు. శరీరంలోని ప్రధానమైన అవయవాలేవీ పనిచేయకపోవడంతో ఆయన తుదిశ్వాస విడించారు. కృష్ణ కోలుకునేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన శరీరం సరిగా స్పందించలేదు. దాంతో ఆయన కన్నుమూసారు. కృష్ణ కోలుకోవాలని అభిమానులంతా పూజలు చేశారు. కానీ వైద్యులు ప్రయత్నాలు గానీ.. అభిమానుల పూజలు గానీ ఫలించలేదు. కృష్ణ మరణవార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పెద్దలు దిగ్భ్రాంతికి గురైయ్యారు.
కృష్ణ మరణంతో సితార, గౌతమ్ కూడా చాలా ఆవేదనకి గురయ్యారు. సితారా ఘట్టమనేని తాజాగా తన తాత కృష్ణ మరణం మీద ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టింది.. ఇకపై వీకెండ్ లంచ్‌లు ఇంతకు ముందున్నట్టుగా ఉండవు.. మీరు నాకు ఎన్నో విలువలు నేర్పించారు.. నన్ను ఎప్పుడూ నవ్విస్తూనే ఉండేవారు.. అవన్నీ ఇప్పుడు నాకు కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి.. మీరే నా హీరో.. నేను ఏదో ఒక రోజు మిమ్మల్ని గర్వపడేలా చేస్తాననే నమ్మకం నాకుంది.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాను తాత గారు అంటూ సితార తన పోస్ట్‌లో చాలా ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.
![Gautam Krishna And Sitara : మిస్ యూ తాతగారు అంటూ గౌతమ్, సితార ఎమోషల్ పోస్ట్ Gautam Krishna And Sitara emotional post about their grand dad](http://3.0.182.119/wp-content/uploads/2022/11/gautam-krishna-sitara.jpg)
ఇక తాత మరణాన్ని తట్టుకోలేని మనవడు గౌతమ్ కూడా తన సోషల్ మీడియాలో తాతయ్య కృష్ణ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. మీరు ఎక్కడ ఉన్నా, నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. అలాగే మీరు కూడా నన్ను ప్రేమిస్తుంటారని నాకు తెలుసు. నేను చెప్పలేనంతగా మిమ్మల్ని మిస్ అవుతున్న, మిస్ యూ తాత గారూ అంటూ కృష్ణతో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు గౌతమ్. సితార, గౌతమ్ పోస్ట్‌లు చూసి కృష్ణ అభిమానులతో పాటు మహేష్ అభిమానులు కూడా ఫుల్ ఎమోషనల్ అవుతున్నారు.