ఎప్పుడు వివాదాలతో వార్తలలో నిలుస్తూ ఉండే శ్రీరెడ్డి ఇటీవల యూట్యూబ్‌తో మరింత పాపులారిటీ దక్కించుకుంది. వారానికి ఒక వెరైటీ వీడియో చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తుంది. ఇక అప్పుడప్పుడు తన నోటికి కూడా పని చెబుతూనే ఉంటుంది. పవన్ విషయంలో మాత్రం ఫుల్ ఫైర్ అవుతుంటుంది. ఆ మధ్య పనవ్ కళ్యాణ్.. వైసీపీ నాయకులని ఎండగడుతూ.. వెధవల్లారా.నన్ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతా నా కొడకల్లారా? నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకురా.మీరూ చేసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ వీరావేశంతో రెచ్చిపోయి మాట్లాడారు. ఏకంగా చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు.
పవన్ వ్యాఖ్యల తర్వాత లైవ్ లోకి వచ్చిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరుగుతూ బూతులతో తిడుతూ రెచ్చిపోయింది.అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ కి చెప్పు చూపిస్తూ.ఇది బాటా వాళ్ల చెప్పు. చాలా స్ట్రాంగ్ ఉంటుంది.కొట్టానంటే మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ ఎర్రి తనానికి.రౌడీయిజానికి. టైం దగ్గరపడింది అని నానా మాటలు అంది. అప్పట్లో ఆయన అమ్మని కూడా అనరాని మాటలు అని తర్వాత సారీ చెప్పింది. అయితే పవన్ అంటే ఎప్పుడు విరుచుకుపడుతూ ఉండే శ్రీరెడ్డి తాజాగా ఆయనకు సపోర్ట్‌గా నిలవడం విశేషం.
పవన్ పై వ్యతిరేకంగా వైసీపీ నాయకుడు అనిల్ రెడ్డి అనే వ్యక్తి దారుణంగా మాట్లాడు. దీంతో శ్రీరెడ్డి అతనని బూతులతో కడిగిపారేసింది. దమ్ముంటే పవన్ ను విమర్శించండి.. అవసరమైతే మళ్లీ మళ్లీ విమర్శించండి.. కానీ పవన్ భార్య, పిల్లలు ఏమన్నారు..? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పు చేస్తే అతన్ని తిట్టాలి కానీ, పవన్ కళ్యాణ్ మాజీ భార్యని, ఆయన పిల్లల్ని వైసీపీ పార్టీలో ఉన్న అనీల్ కుమార్ అనే దరిద్రుడు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. అనీల్ కుమార్ అనేవాడు వైసీపీ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అసలు నీకు వైసీపీకి సంబంధం ఏంట్రా వెధవా? చంపుతా నరుకుతా అని బెదిరిస్తున్నాడు వీడు. పోలీసులు వీడిపై యాక్షన్ తీసుకోవాలి. మరి నువ్వు మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఊరుకుంటారు అనుకుంటున్నావా అంటూ శ్రీరెడ్డి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.