Thaman : తెలుగు సినీ పరిశ్రమ స్థాయి రోజురోజుకి పెరుగుతూ పోతుంది. ఒకప్పుడు మన సినిమాలని పట్టించుకోని నార్త్ స్టార్స్ ఇప్పుడు మన సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారంటే టాలీవుడ్ క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇటీవలి కాలంలో టాలీవుడ్ సినిమా సంగీతం పరిస్థితి దయనీయంగా మారింది. పెద్ద హీరోలు థమన్, దేవి శ్రీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వారిపై పలుమార్లు కాపీ ఆరోపణలు వస్తున్నా కూడా ఈ హీరోలు వారితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల వాల్తేరు వీరయ్యలోని ‘బాస్ పార్టీ’, వీరసింహారెడ్డిలోని ‘జై బాలయ్య పాటలు విడుదల కాగా, ఈ రెండు పాటలు శ్రోతలు మరియు అభిమానుల నుండి తీవ్ర విమర్శలను అందుకుంటున్నాయి.
థమన్ స్వరపరచిన ‘జై బాలయ్య సాంగ్ ఒసేయ్ రాములమ్మ నుండి కాపీ పేస్ట్ చేశాడని అంటున్నారు.. వందేమాతరం శ్రీనివాస్ మ్యాజిక్ నుండి లేపేసాడని అంటున్నారు. రామజోగయ్యశాస్త్రి ఈ పాటకు ‘జై బాలయ్య’ అనే టైటిల్‌గా ఔత్సాహిక సాహిత్యం అందించారు.కాని థమన్ మాత్రం కాపీ చేసి అభిమానులని నిరాశపరిచాడు. ఇక దేవి శ్రీ కూడా కాపీ చేశాడని అంటున్నారు. 14 ఏళ్ల క్రితం శింబు పాడిన ‘పార్టీ ఎక్కడ’ అనే లైన్‌తో సాగే సిలంబాట్టం పాట నుండి డీఎస్‌పీ బాస్ పార్టీని తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ ఇద్దరు సంగీత దర్శకులకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో, వారు ఇచ్చిన పాటల క్వాలిటీ చూసి ఇండస్ట్రీలోని చాలా మంది సంగీత దర్శకులు నోరెళ్లబెడుతున్నారు. కోట్లాది రెమ్యూనరేషన్‌తో పాటు, ఈ సంగీత దర్శకులకు స్టార్ హోటళ్లలో వసతి కూడా ఇస్తున్నారు , కాని వారు అందించే కంటెంట్ లో నాణ్యత లేని సగటు ప్రేక్షకుడి మాట. ఇక సంక్రాంతి బరిలోకి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలు వస్తున్నాయి. ఈ రెండు కూడా మాస్ సినిమాలే. ఇద్దరూ కూడా మాస్ డైరెక్టర్లే. బాలయ్య సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో పవర్ ఫుల్‌గా ఉండబోతోంది.