Giloy Juice : భారతీయ సంప్రదాయ అతిపురాతన వైద్యం ఆయుర్వేదం. ఈ వైద్యంలో ఉపయోగించే ఔషధాలు మొత్తం మన చుట్టు పక్కల ఉండే మొక్కల నుంచి మూలికలు, ఔషధాల ద్వారా తయారవుతూ ఉంటాయి. అయితే చాలా రకాల మూలికలు ఔషధాల చెట్లు మన చుట్టుపక్కలే ఉంటాయి కానీ మనకు అస్సలు తెలియదు. అలాంటి ఒక ఔషధాల గని తిప్పతీగ. తిప్పతీగ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలున్నాయో చూద్దాం.. మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే తిప్పతీగతో చెక్ పెట్టొచ్చు. క్రమం తప్పకుండా తిప్పతీగను తీసుకోవడం ద్వారా నిద్ర బాగా రావడమే కాకుండా ఒత్తిడి స్థాయి కూడా చాలా వరకు అదుపులోకి వస్తుంది.
వేగంగా పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడుతుంటే.. బరువును తగ్గించుకోవడానికి ఆహారంలో తిప్పతీగను చేర్చుకోవాలి. ఈ మొక్కలో అడిపోనెక్టిన్, లెప్టిన్ అనే మూలకాలు శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో తిప్పతీగ అద్భుతంగా పనిచేస్తుంది. తిప్పతీగలోని మూలకాలు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటమే కాకుండా శరీరం నుంచి ప్రమాదకరమైన టాక్సిక్ యాంటీఆక్సిడెంట్లను తొలగించడానికి కూడా పని చేస్తాయి.
కడుపు నొప్పితో బాధపడేవారు కూడా తిప్పతీగ నుంచి ఉపశమనం పొందవచ్చు. అజీర్ణం, అసిడిటీ లేదా కడుపునొప్పితో బాధపడేవారు తిప్పతీగ రసాన్ని తాగితే ఉపశమనం లభిస్తుంది. మధుమేహం లేదా బ్లడ్ షుగర్ ఉన్నవారికి తిప్పతీగ వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటి వారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తిప్పతీగ జ్యూస్ తాగవచ్చు. ఈ జ్యూస్ కొంచెం చేదుగా ఉన్నా షుగర్ లెవెల్ ని చాలా వరకు కంట్రోల్ లోకి తెస్తుంది. అంతేకాదు చర్మం కాంతివంతంగా మెరవడంలో తిప్పతీగ కీలకపాత్ర పోషిస్తుంది.