Anasuya : జబర్ధస్త్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల యాంకరమ్మ అనసూయ. చాలా తక్కువ సమయంలోనే అందంతో పాటు చలాకీ మాటలతో అలరించిన ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తన సత్తా చూపింది. ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ భరద్వాజ్ యమ యాక్టివ్‌గా ఉంటూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఈ అమ్మడు ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీగా ఉంటూ పర్సనల్ లైఫ్ కూడా సాఫీగా సాగేలా చూసుకుంటుంది.
అయితే అనసూయ ఈ స్థాయికి రావడం వెనక చాలా కష్టం ఉంది. ఎంబీఏ పూర్తి చేసిన అనసూయ సిక్స్ లాయిడ్ అనే విజువల్ కంపెనీలో టెలీకాలర్ గా ఉద్యోగం చేసేదట. అనసూయ ఓ బ్యాంకులో కూడా రూ.5 వేల జీతానికి ఉద్యోగం చేసేదట. తరరువాత యాంకరింగ్ పై ఉన్న ఆసక్తి తో సాక్షిలో అనసూయ యాంకర్ గా చేరింది. ఇక జబర్ధస్త్ షో ఆఫర్ రావడంతో వెంటనే అక్కడకు వచ్చేసి టాప్ యాంకర్‌గా ఎదిగింది. ఇక నటిగా కూడా తానేంటో నిరూపించుకుంది. అయితే అనసూయది ప్రేమ పెళ్లి కాగా, ఆమె లవ్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది.
![Anasuya : అనసూయ 15 ఏళ్లకే ప్రేమలో పడిందా.. ఆమె లవ్‌స్టోరీలో ఇంత కిక్ ఉందా..! do you know about Anasuya and her husband story](http://3.0.182.119/wp-content/uploads/2022/09/anasuya-2.jpg)
అనసూయ తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ప్రేమలో పడినట్టు ఓ టీవీ షో లో తెలిపింది. మొదట ఎన్సిసి క్యాంప్ లో తన భర్త తో పరిచయం ఏర్పడిందని ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారగా, ఆ తర్వాత పెద్దలని ఒప్పించి అనసూయ పెళ్లి చేసుకుంది. వారి వైవాహిక దాంపత్యంలో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అనసూయ షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి తప్పక సమయం కేటాయిస్తుంది.