Dil Raju : సంక్రాంతికి థియేటర్ల దగ్గర ఎంత పోటీ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు వచ్చి ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తుండగా , ఈ సంక్రాంతికి మాత్రం ఏకంగా ఐదు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ స్టార్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యేందుకు ఇప్పుడు సిద్దం కావడం వివాదాస్పదంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం, వెంకటేశ్.. సైంధవ్, రవితేజ.. ఈగల్, తేజ సజ్జా హనుమాన్, నాగార్జున నటిస్తోన్న నా సామిరంగ సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకులని అలరించనున్నాయి.
అయితే ఐదు సినిమాలు ఒకేసారి వస్తుండడంతో థియేటర్ల సద్దుబటు కష్టంగా మారింది. అయితే నిర్మాతలెవరూ వెనక్కి తగ్గకపోవడంతో సంక్రాంతి సినిమాల వివాదంపై నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు స్పందించారు. సంక్రాంతి రేసు నుంచి రెండు సినిమాలు తప్పుకుంటే థియేటర్లు సర్దుబాటు చేయడం సులభం అవుతుందని అన్నారు. ఇప్పుడు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నవారికి ఆ తర్వాత సోలో రిలీజ్ డేట్ ఛాంబర్ తరఫున ఇస్తామని ఐదుగురు నిర్మాతలకు చెప్పినట్టు దిల్ రాజు వెల్లడించారు. గుంటూరు కారం నిర్మాతలు మినహా మిగతా నిర్మాతల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే అందరికీ లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
సంక్రాంతికి ఐదు భారీ చిత్రాలు విడుదలైతే ఏ సినిమాకు న్యాయం జరగదని అన్నారు దిల్ రాజు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించనున్నట్లు తెలిపారు. ఇటీవలే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశామని, సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు దిల్ రాజు. . ఫిల్మ్ ఛాంబర్లో ఆ ఐదు చిత్రాల నిర్మాతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు.గుంటూరు కారం నిర్మాతలు తప్ప మిగతా నలుగురు నిర్మాతల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే అందరికీ లాభదాయకంగా ఉంటుందని దిల్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే చిత్ర నిర్మాతకు ఎలాంటి పోటీ లేకుండా సోలో తేదీ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని వివరించారు. సంక్రాంతికి ఐదు చిత్రాలు విడుదలైతే ఏ సినిమాకు న్యాయం జరగదన్న దిల్ రాజు, సినిమా విడుదల తేదీలపై చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదన్నారు.