Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Chiranjeevi Sri Devi : శ్రీదేవి, చిరంజీవిల వ‌జ్రాల దొంగ చిత్రం మ‌ధ్య‌లోనే ఎందుకు ఆగిపోయిందంటే..?

Shreyan Ch by Shreyan Ch
November 21, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Chiranjeevi Sri Devi : మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రాలు ఎంత పెద్ద విజ‌యం సాధించాయో మ‌నం చూశాం. ఈ ఇద్ద‌రికి అభిమానుల‌లో ఫుల్ క్రేజ్ ఉండేది. ముఖ్యంగా శ్రీదేవి డేట్స్ కోసం నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఎంత‌గా ఎదురు చూసేవాళ్లో మ‌నం చూశాం. ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి సౌత్‌లోనే నంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగిన స్టోరీ శ్రీదేవిది.. అయితే చిరు, శ్రీదేవిల కలయికలో.. భారీ అంచనాలతో మొదలైన ఓ సినిమా మధ్యలోనే ఆగిపోయిందనే విషయం చాలా మందికి తెలీదు. ఈ సినిమా కోసం శ్రీదేవి నిర్మాతగా కూడా మారారు. తన చెల్లెలు శ్రీలత పేరు మీద శ్రీలత ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేశారు.

తన అభిమాన దర్శకుడు కోదండరామి రెడ్డిని ఈ చిత్రానికి దర్శకుడిగా నియమించుకున్నారు.ఈ చిత్రానికి ‘వజ్రాల దొంగ’ అనే టైటిల్ కూడా అనుకున్నారు కానీ అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యలేదు. మణిరత్నం ‘మౌనరాగం’ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఆధారంగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈ కథ రాశారు. బప్పీ లహరిని మ్యూజిక్ డైరెక్టర్‌గా సెలక్ట్ చేశారు. బప్పిలహరి సంగీత సారథ్యంలో ముంబైలో పాటలు రికార్డ్‌ చేశారట.అయితే రికార్డింగ్‌ సమయంలో శ్రీదేవి దగ్గరుండి అన్నీ చూసుకున్నారు.

Chiranjeevi Sri Devi vajrala donga movie stopped why
Chiranjeevi Sri Devi

అయితే ఎప్పుడు ఎలా కలెక్ట్‌ చేశారో తెలీదు కానీ శ్రీదేవి దగ్గర బోలెడంత మ్యూజిక్‌ కలెక్షన్‌ ఉండడంతో అవన్నీ కూడా బప్పిలహరికి వినిపించి పాటలను రికార్డ్‌ చేయించుకున్నారట శ్రీదేవి. సినిమా కోసం చెన్నైలో సెట్‌ వేసి ఓ పాట చిత్రీకరించగా అప్పటికే ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్‌ వచ్చిందట.ఇకపోతే సాధారణంగా ఎప్పుడు కూడా బయ్యర్స్‌ దర్శకుడు కోదండరామిరెడ్డి దగ్గరకి వచ్చి ఈ సినిమా మాకు ఇప్పించండి అని అడగలేదట. ఈ సినిమాకు చాలామంది పోటీపడి ఆయన దగ్గరకు వచ్చి మరి రికమండ్‌ చేయమనే వారట.సినిమా క్రేజ్‌ చూసి కోదండరామిరెడ్డికి డౌట్‌ వచ్చింది.

ఎప్పుడూ లేనిది బయ్యర్స్, కోదండరామి రెడ్డి దగ్గరకి వచ్చి.. ‘సినిమా మాకు ఇప్పించండి’ అంటూ రిక్వెస్ట్ చెయ్యడం మొదలెట్టారు. రైట్స్ కోసం పోటీ పడేవారు.. శ్రీదేవికి ఎలాగైనా రికమండ్ చెయ్యమనేవారు.. సినిమాకి వచ్చిన హైప్ చూసి కోదండరామి రెడ్డికి ఎక్కడో తేడా కొట్టింది.. శ్రీదేవి దగ్గరకెళ్లి.. ‘అమ్మా.. నాకెందుకో ఇప్పుడు మనం చేస్తున్న సబ్జెక్ట్ అంచనాలను అందుకుంటుందా, లేదా? అని డౌట్‌గా ఉంది.. ఏం చేద్దాం?’’ అని అడిగారట..దాంతో శ్రీదేవి.. ‘సాంగ్స్ అయితే బాగా వచ్చాయి.. సబ్జెక్ట్ గురించి మీకు తెలిసినంతగా నాకు తెలియదు.. పోనీ, దీన్ని ఇక్కడితో ఆపేసి.. ఇంకో మంచి కథతో సినిమా చేద్దాం.. లేదంటే, ఇదే కథను ఇంకా బాగా డెవలప్ చేసే ఛాన్స్ ఉందేమో చూడండి’ అన్నారట.

దీనిపై బాగానే క‌స‌ర‌త్త‌లు చేసిన అనుకున్నంత ఔట్ పుట్ రాలేదట‌. శ్రీదేవి చెప్పింది కదా అని చిరంజీవి కూడా సినిమా చూశారు. పెద్దగా నచ్చలేదు సరికదా లెంగ్త్ ఎక్కువనిపించింది.. ఇలా చాలా ప్రయత్నాలు చేసి, చివరికి చిరంజీవి, శ్రీదేవిల ఇమేజ్, కాంబినేషన్‌కున్న క్రేజ్‌కి తగిన కథ దొరక్కపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత శ్రీదేవి మళ్లీ ఎప్పుడూ నిర్మాణం జోలికి వెళ్లలేదు..ఇలా వ‌జ్రాల దొంగ సినిమా ఆగిపోయింది.

Tags: chiranjeevisri deviTollywood
Previous Post

Amla : ఈ సీజ‌న్‌లో అధికంగా ల‌భించే ఉసిరి కాయ‌లు.. త‌ప్ప‌క తీసుకోవాల్సిందే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Next Post

Chatrapathi Movie : ఛ‌త్ర‌ప‌తిలోని ఆ సీన్ రాజ‌మౌళికి ఇప్ప‌టికీ న‌చ్చ‌ద‌ట‌.. మ‌రి ఎందుకు తీసిన‌ట్లు..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.